సకాలంలో ఫిర్యాదు చేస్తే.. | - | Sakshi
Sakshi News home page

సకాలంలో ఫిర్యాదు చేస్తే..

Jan 24 2026 8:48 AM | Updated on Jan 24 2026 8:48 AM

సకాలం

సకాలంలో ఫిర్యాదు చేస్తే..

సకాలంలో ఫిర్యాదు చేస్తే.. విస్తృతంగా అవగాహన..

సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోయిన బాధితులు సకాలంలో పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేస్తే పోయిన నగదు రికవరీ చేయడంతోపాటు ఫ్రీజ్‌ చేస్తున్నాం. మూడేళ్లుగా నాగర్‌కర్నూల్‌ పోలీస్‌స్టేషన్‌లో సైబర్‌ వారియర్‌గా విధులు నిర్వహిస్తున్నాను. డయల్‌ నం.1930తోపాటు సాధారణ పద్ధతుల్లో 467 ఫిర్యాదులు రావడంతో 54 కేసులు నమోదు చేశారు. బాధితులకు సంబందించి రూ.15.23 లక్షల మేర నగదు రికవరీ చేశాం. ఇటీవల రాష్ట్రస్థాయిలో సైబర్‌ వారియర్స్‌కు అందించిన రివార్డుతోపా టు నగదు పురస్కారాన్ని అందుకున్నాను.

– హన్మంతు, కానిస్టేబుల్‌, నాగర్‌కర్నూల్‌

గత రెండేళ్లుగా అచ్చంపేట పోలిస్‌స్టేషన్‌లో సైబర్‌ వారియర్‌గా విధులు నిర్వహిస్తున్నాను. ఇప్పటి వరకు బాధితుల నుంచి 90 ఫిర్యాదులు రాగా.. 15 కేసుల్లో రూ.5 లక్షల మేర రికవరీ చేయించి బాధితులకు అందజేశాం. ప్రజలు సైబర్‌ నేరగాళ్ల చేతుల్లో మోసపోకుండా పోలీసుశాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇటీవల రాష్ట్రస్థాయిలో సైబర్‌ వారియర్స్‌కు అందించిన రివార్డును అందుకున్నాను.

– లక్ష్మీపతి, కానిస్టేబుల్‌, అచ్చంపేట

సకాలంలో ఫిర్యాదు చేస్తే.. 
1
1/1

సకాలంలో ఫిర్యాదు చేస్తే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement