రేపటి నుంచి పాలెం వేంకన్న బ్రహ్మోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి పాలెం వేంకన్న బ్రహ్మోత్సవాలు

Jan 19 2026 6:34 AM | Updated on Jan 19 2026 6:34 AM

రేపటి

రేపటి నుంచి పాలెం వేంకన్న బ్రహ్మోత్సవాలు

బిజినేపల్లి: మండలంలోని పాలెం శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు శ్రీవారి అభిషేకం, కోయిల్‌ అళ్వార్‌ తిరుమంజనం, యాగశాల ప్రవేశం, రక్షాబంధన్‌, హంసవాహన సేవ, బుధవారం నిత్యారాధన, బలహరణం, ధ్వజారోహణం, గరుడ పొంగళి నివేదన, సంతానం లేని వారికి ప్రసాద వితరణ, హనుమత్‌ వాహన సేవ, నివేదన ఉంటుంది. గురువారం నిత్య పూజలు, ప్రబంధ పారాయణం, లక్ష పుష్పార్చన, గరుడ వాహన సేవ, శుక్రవారం అలివేలు మంగ సమేత శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణం, గజ వాహన సేవ, శనివారం హోమం, పల్లకిసేవ, ఆదివారం సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు, రథోహోమం, కుంభ పూజ, శ్రీవారి మాఢ వీధుల్లో రథోత్సవం (తేరు), వచ్చే సోమవారం స్వామివారి ఉద్దాల మహోత్సవం, బలహరణం, అశ్వవాహన సేవ, వచ్చే మంగళవారం స్వామివార్లకు పూర్ణాహుతి, చక్రస్నానం, ధ్వజ అవరోహణం, పుష్పయాగం, శేషవాహన సేవ, పవళింపు సేవ, పండిత సన్మానాలు, ఉత్సవ పరిసమాప్తితో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. అలాగే ఆయా రోజుల్లో విద్యార్థులకు సాంస్కృతిక, భజన మండళ్లకు భజన పోటీలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయ సుందరీకరణ, విద్యుదీపకాంతుల అలంకరణ తదితర ఏర్పాట్లు చేశామని ఆలయ చైర్మన్‌ మనుసాని విష్ణుమూర్తి తెలిపారు.

పాలెంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం (ఇన్‌సెట్‌లో) స్వామివారి మూలవిరాట్‌

23న కల్యాణం..

25న రథోత్సవం

రేపటి నుంచి పాలెం వేంకన్న బ్రహ్మోత్సవాలు 1
1/1

రేపటి నుంచి పాలెం వేంకన్న బ్రహ్మోత్సవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement