ఆశావహుల సందడి..
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటం.. ఆ వెంటనే నామినేషన్ల పర్వం మొదలు కావడంతో మున్సిపల్ కార్యాలయాలు, క్లస్టర్ కేంద్రాల వద్ద సందడి కొనసాగుతోంది. ఓవైపు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు వస్తుండగా.. మరోవైపు ఆశావహులు మున్సిపల్ కార్యాలయాల్లో గుమిగూడుతున్నారు. ఎన్నికల్లో పోటీచేసేందుకు అవసరమైన నో డ్యూ సర్టిఫికెట్లు పొందేందుకు ఇంటి టాక్స్, నల్లాబిల్లులు, పెండింగ్ బిల్లులను చెల్లిస్తున్నారు. అభ్యర్థులతో పాటు ప్రతిపాదకులకు సైతం నో డ్యూ సర్టిఫికెట్ అవసరం కావడంతో మున్సిపల్ కార్యాలయాల వద్ద సందడి నెలకొంది.


