వలస పక్షుల సందడి
బిజినేపల్లి మండలం గంగారం రిజర్వు ఫారెస్ట్‌లో వలస పక్షులు సందడి చేస్తున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి నీటి పక్షులు కర్ణంకుంట సోలార్ ట్యాంకు వద్దకు చేరుకోగా.. అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్ట్ సిబ్బంది హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీతో కలిసి నీటిపక్షుల గణన చేపట్టారు. ఈ గణనలో అరుదైన ఓపెన్‌బిల్ కొంగ, పెయింటెడ్ కొంగ, గ్రే హెరాన్, రెడ్ క్రెస్టెడ్ పోచార్డ్, ఎగ్రెట్, పర్పుల్ హెరాన్ జాతి పక్షులను గుర్తించారు.
– బిజినేపల్లి
ఎల్లో వాట్లెడ్ లాపింగ్
లిటిల్ గ్రేబ్
రెడ్ క్రెస్టెడ్ పోచార్డ్
స్పాట్ బిల్డ్


