పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ
● ఈసీ నిబంధనలు అందరూ పాటించాలి
● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్
బదావత్ సంతోష్
నాగర్‌కర్నూల్/నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాలోని మూడు మున్సిపాలిటీల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని.. రాజకీయ పార్టీల ప్రతినిధులు తమవంతు సహకారం అందించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ కోరారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో అదనపు కలెక్టర్ దేవ సహాయంతో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థులు తప్పనిసరిగా నామినేషన్ పత్రాల్లో పార్టీ పేరు విధిగా రాయాలని.. పార్టీ తరఫున బీఫాం అందజేసే వ్యక్తి పేరుతో రాష్ట్ర పార్టీ నుంచి అందించే ధ్రువపత్రాన్ని ఈ నెల 30వ తేదీలోగా అందజేయాలని సూచించారు. ప్రతి అభ్యర్థి రూ. లక్ష వరకు మాత్రమే ఎన్నికల్లో ఖర్చు చేయాలని.. ఇందుకు కొత్త అకౌంట్ ఓపెన్ చేయాలన్నారు. ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహి ంచేందుకు అన్ని రాజకీయ పార్టీలతో పాటు అభ్యర్థులు, అధికారులు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి డేవిడ్ రాజు, బీఆర్‌ఎస్ తరఫున శ్రీశైలం, నర్సి ంహ, బీజేపీ నుంచి సుధాకర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, బీ ఎస్పీ నుంచి రామకష్ణ, వైఎస్సార్ పార్టీ నుంచి ఎండీ హుస్సేన్, టీడీపీ నుంచి బాలకృష్ణ పాల్గొన్నారు.


