తొలిరోజు 32 నామినేషన్లు
● కాంగ్రెస్ తరఫున 13, బీఆర్‌ఎస్ 10, బీజేపీ నుంచి 5 దాఖలు
● నేడు, రేపు ఊపందుకోనున్న
నామినేషన్ల పర్వం
సాక్షి, నాగర్‌కర్నూల్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభమైన నేపథ్యంలో బుధవారం జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో 32 నామినేషన్లు దాఖలయ్యాయి. నాగర్‌కర్నూల్‌లో 11, కల్వకుర్తిలో 14, కొల్లాపూర్‌లో 7 నామినేషన్లు వచ్చాయి. మొదటి రోజు కాంగ్రెస్ తరఫున 13, బీఆర్‌ఎస్ 10, బీజేపీ 5, బహుజన్‌ముఫ్తి పార్టీ నుంచి ఒకటి, ఇండిపెండెంట్ అభ్యర్థులు 3 నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లకు ఈ నెల 30 వరకే గడువు ఉంది. గురు, శుక్రవారాల్లో నామినేషన్ల కోసం అభ్యర్థులు పోటెత్తనున్నారు. ముహూర్తాన్ని దృష్టిలో ఉంచుకొని గురువారం ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది.


