పతంగుల పోటాపోటీ
సంక్రాంతి అంటేనే పతంగుల పోటీ ఎక్కువగా కనిపిస్తుంది. చిన్నా.. పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి పంతుగులు ఎగరేయడంలో ఉండే ఆనందమే వేరు. నలుగురు స్నేహితులు కలిసి ఓ బంగ్లాపై చేరి మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకుని పతంగులు ఎగురవేస్తూ సంబరపడిపోతుంటారు. వారి మధ్యలో చిన్నారులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. సంక్రాంతికి నెలరోజుల ముందే పతంగుల వ్యాపారం జోరందుకుంటుంది. జిల్లావ్యాప్తంగా ప్రధాన రహదారుల్లో అనేక పతంగుల దుకాణాలు వెలిశాయి. గతంలో ఒకటో, రెండో మాత్రమే ఉండేవి. ఇప్పుడు ప్రతి బజారు, గల్లీలోనూ పతంగుల విక్రయ కేంద్రాలు వెలిశాయి. గిల్లర్, పట్టేదార్, తారా, కడ్డీదార్, పచ్చీస్, చౌపన్, దూలందార్, లంగోటి, సందార్, జీబాస్, చాంద్ తదితర పేర్లతో, పలు రకాల డిజైన్‌లతో రూ.20 నుంచి రూ.300 వరకు గాలిపటాలు అందుబాటులో ఉన్నాయి.


