బీసీలకు 24 స్థానాలు
● జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు
● మహిళలకు 25 స్థానాలు
రిజర్వు చేసిన అధికారులు
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసింది. మున్సిపాలిటీల్లోని మొత్తం వార్డు స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు అధికారులు వార్డు రిజర్వేషన్లను కేటాయించారు. మొత్తం రిజర్వేషన్లలో సగం సీట్లను మహిళలకు ఖరారు చేశారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 85 వార్డు స్థానాలకు గాను బీసీలకు మొత్తం 24 స్థానాలు, మహిళలకు 25 వార్డు స్థానాలు ఖరారయ్యాయి.
● జిల్లాలోని అచ్చంపేట మున్సిపాలిటీ పాలకవర్గానికి మరో నాలుగు నెలల పాటు సమయం ఉంది. ఇక్కడ మొత్తం 20 వార్డు స్థానాలకు గాను 2 ఎస్టీ, 3 ఎస్సీ, 5 స్థానాలు బీసీలకు రిజర్వు అయ్యాయి. మొత్తం 6 స్థానాలు మహిళలకు రిజర్వ్ చేశారు.
● కల్వకుర్తి మున్సిపాలిటీల్లో 22 వార్డు స్థానాలకు గాను 2 ఎస్టీ, 3 ఎస్సీ, 6 బీసీలకు రిజర్వు అయ్యాయి. ఇందులో మహిళలకు 6 వార్డు స్థానాలను కేటాయించారు.
● కొల్లాపూర్ మున్సిపాలిటీలో 19 వార్డులకు 1 ఎస్టీ, 3 ఎస్సీ, 5 బీసీలకు కేటాయించగా మహిళలకు మొత్తం 6 స్థానాలు దక్కాయి.
● నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డు స్థానాలకు గాను 1 ఎస్టీ, 3 ఎస్సీ, 8 బీసీలకు రిజర్వ్ కాగా, మొత్తం 7 స్థానాలను మహిళలకు కేటాయించారు.


