3 మున్సిపాలిటీలు.. 23 క్లస్టర్లు
● నామినేషన్ల స్వీకరణకు వీలుగా క్లస్టర్లు, హెల్ప్‌డెస్క్‌ల ఏర్పాటు
కల్వకుర్తి టౌన్: మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేయడంతో జిల్లాలోని ప్రవర్తనా నియామవళి (ఎన్నికల కోడ్) అమలులోకి వచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా.. బుధవారం నుంచి జిల్లాలోని నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి మున్సిపాలిటీల్లో నామినేషన్ల స్వీకరణ అధికారులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. అలాగే వార్డుల వారీగా వచ్చిన రిజర్వేషన్లకు సంబంధించిన ప్రత్యేక బ్యానర్ ఏర్పాటు చేశారు. ఇందులో ఏ వార్డులకు ఏ కేంద్రం (గది)లో నామినేషన్లను స్వీకరిస్తారో రూట్‌మ్యాప్‌లను రూపొందించారు. అభ్యర్థులకు నామినేషన్ పత్రాలతోపాటు ఎలాంటి పత్రాలను జతపరచాలి అనే విషయాలను రిటర్నింగ్ అధికారులు సమాచారం ఇచ్చేలా చర్యలు చేపట్టారు.
ఒక క్లస్టర్‌లో మూడు వార్డులకు..
జిల్లాలోని కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్ మున్సిపాలిటీల్లోని వార్డులకు అనుగుణంగా నామినేషన్ల స్వీకరణకు క్లస్టర్లను ఏర్పాటు చేశారు. మూడు మున్సిపాలిటీల్లో కలిపి 65 వార్డులు ఉండగా.. 23 క్లస్టర్లను ఏర్పాటు చేసి.. ఒక్కో క్లస్టర్‌లో మూడు వార్డులకు సంబంధించిన నామినేషన్లు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నారు. 23 మంది రిటర్నింగ్ అధికారులతోపాటు వారికి సహాయకులుగా మరో ముగ్గురు ఒక్కో క్లస్టర్‌లో విధులు నిర్వర్తించున్నారు. వీరికి అదనంగా మరో ఒక్కో మున్సిపాలిటీకి మరో ఇద్దరు రిటర్నింగ్ అధికారులు, సహాయక అధికారులను రిజర్వులో ఉంచారు.
వార్డు ఆఫీసర్లకు శిక్షణ..
నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థుల కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి మున్సిపాలిటీలో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు. అభ్యర్థు లు నామినేషన్ నింపే సమయంలో, ఏవైనా పత్రా లను తక్కువగా ఉంటే వాటిని జతపరచటం, నా మినేషన్ పత్రంలో ఎలాంటి తప్పులు దొర్లకుండా ఉండేందుకు అన్ని వివరాలను హెల్ప్‌డెస్క్ అధికారులు అందించనున్నారు. దీనిపై వార్డు ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.


