సంతోషంగా జరపుకొంటాం..
సంక్రాంతి పండుగను మేము కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకొంటాం. ఉదయాన్నే వాకిట్లో కల్లాపి చల్లి రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు, రేగి పండ్లు పెట్టి పూజలు నిర్వహిస్తాం. కొత్త బియ్యం పిండి, నూనె, బెల్లం, నువ్వులతో గారెలు, అరిసెలు చేస్తాం. అలాగే నువ్వుల ఉండలు, కజ్జకాయలు కూడా సంక్రాంతి స్పెషల్ వంటకాలు చేసుకుంటాం. – అలివేల,
గృహణి, దత్తాత్రేయకాలనీ, నాగర్‌కర్నూల్


