చింతలకుంటవాస.. శ్రీఆంజనేయ
● నేటినుంచి స్వామివారి ఉత్సవాలు
● ఇక్కడ మాంసం, కల్లుతోనే నైవేద్యం
● కోళ్లు, పొట్టేళ్లు బలిచ్చి మొక్కుల చెల్లింపు
●
మహిమ గల దేవుడు..
మా పూర్వీకుల నుంచి చింతలకుంట ఆంజనేయస్వామిని కొలుస్తున్నాం. ఈ స్వామివారు చాలా మహిమ గల దేవుడు. మా కుటుంబం ఆలయ అభివృద్ధిలో కొద్దిమేర భాగస్వాములయ్యాం. ప్రజాప్రతినిధులు, భక్తులు, దాతలు ముందుకొచ్చి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సహకరించాలి. – వెంకటస్వామి,
భక్తుడు, సూగూరు, పెబ్బేరు మండలం
భక్తుల రాక పెరుగుతోంది..
కోరిన కోరికలు తీరుతుండటంతో ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య ఏటా పెరుగుతుంది. పెద్దసంఖ్యలో భక్తుల రాకను దృష్టిలో ఉంచుకొని ఆలయం, పరిసరాలను అభివృద్ధి చేసేందుకు భక్తులు, దాతలు ముందుకు రావాలి. ఇక్కడ ప్రతి అమావాస్య రోజు కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తాం.
– వెంకటేశ్వర్లు, ఆలయ పూజారి
వనపర్తి రూరల్: ఆంజనేయస్వామికి సింధూరం, తమల పాకులు, టెంకాయలతో పూజలు నిర్వహిస్తారు. కానీ, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండలంలోని పాతపల్లి శివారులో వెలసిన చింతలకుంట ఆంజనేయస్వామికి మాత్రం మాంసం, కల్లుతో నైవేద్యం సమర్పిస్తారు. ఏకంగా స్వామివారి ఎదుటే పొట్టేళ్లు, కోళ్లు బలిస్తారు. ప్రతిఏటా సంక్రాంతి పండుగ నుంచి మూడురోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవాలకు స్థానికులేగాక వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడి స్వామివారికి అపారమైన శక్తి ఉందని.. కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. కాగా.. బుధవారం ప్రారంభమయ్యే ఉత్సవాలు శుక్రవారం ముగుస్తాయి. ఉత్సవాలను పురస్కరించుకొని తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పంచాయతీ ఆధ్వర్యంలో తాగునీరు ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పెబ్బేరు పోలీసులు చర్యలు చేపడుతున్నారు.
చింతలకుంటవాస.. శ్రీఆంజనేయ
చింతలకుంటవాస.. శ్రీఆంజనేయ
చింతలకుంటవాస.. శ్రీఆంజనేయ


