రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

Feb 2 2026 8:12 AM | Updated on Feb 2 2026 8:12 AM

రోడ్డ

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

చారకొండ: ద్విచక్రవాహనం, డీసీఎం ఎదురెదురుగా ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు దుర్మరణం చెందగా, మరొకరికి తీవ్రగాయాలైన ఘట న ఆదివారం మండలంలో ని తిమ్మాయిపల్లిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్‌కుమార్‌, మహేష్‌, (22) పాతకుల బన్ని (21) ముగ్గురు బైక్‌పై ఆదివారం మండలంలోని సారగట్ల మైసమ్మ వద్దకు వెళ్లి దైవ దర్శనం అనంతరం స్వగ్రామానికి బయలుదేరారు. ఇదే సమయంలో కల్వకుర్తి నుంచి దేవరకొండ వైపు వస్తున్న డీసీఎం బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్‌పై వెనకాల ఉన్న మహేష్‌, బన్ని అక్కడికక్కడే మృతి చెందారు. బైక్‌ నడుపుతున్న రాజ్‌కుమార్‌కు చెయ్యి విరిగి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన యువకులు మహేష్‌ వంగూరు మండలం డిండి చింతపల్లి , బన్నిది తెల్కపల్లి మండలం గౌరారం గ్రామాలకు చెందిన వారుగా గుర్తించారు. గాయాలైన రాజ్‌కుమార్‌ను అంబులెన్స్‌లో కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం 1
1/1

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement