రోగులకు మెరుగైన వైద్యం అందించాలి | - | Sakshi
Sakshi News home page

రోగులకు మెరుగైన వైద్యం అందించాలి

Jan 24 2026 8:48 AM | Updated on Jan 24 2026 8:48 AM

రోగులకు మెరుగైన వైద్యం అందించాలి

రోగులకు మెరుగైన వైద్యం అందించాలి

నాగర్‌కర్నూల్‌ క్రైం: ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా కృషిచేస్తానని ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో 650 పడకల జనరల్‌ ఆస్పత్రికి శుక్రవారం ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డితో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మాత్రమే వేస్తున్నారని పనులు జరగడం లేదని అసత్యప్రచారాలు చేయడం తగదన్నారు. జిల్లా కేంద్రానికి అవసరమైన 650 పడకల ఆస్పత్రి విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి మంజూరు చేయించామని చెప్పారు. ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో 10 ఎకరాలలో రూ.235 కోట్లతో 650 పడకల ఆస్పత్రిని 24 నెలల్లో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. 650 పడకల ఆస్పత్రిని నాణ్యతతో పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌కు సూచించారు. కార్యక్రమంలో మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ రమాదేవి, జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement