‘పుర’ కమిషనర్ బదిలీ
కొల్లాపూర్: స్థానిక మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్‌రావు బదిలీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ ప్రక్రియ చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న చంద్రశేఖర్‌రావు భూత్పూరు మున్సిపాలిటీకి బదిలీ కాగా.. ఆయన స్థానంలో తాండూరు మున్సిపల్ కమిషనర్ యాదగిరి కొల్లాపూర్‌కు బదిలీపై వస్తున్నారు.
నర్సరీల నిర్వహణలో
అలసత్వం వద్దు
ఉప్పునుంతల: వనమహోత్సవంలో భాగంగా ఏర్పాటుచేసిన నర్సరీల నిర్వహణలో అలసత్వం వహించొద్దని డీఆర్డీఓ చిన్న ఓబులేషు అన్నారు. బుధవారం మండలంలోని దేవదారికుంట తండాలో నర్సరీ ఏర్పాటు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. నర్సరీ పనులు త్వరగా పూర్తిచేసి.. విత్తనాలు నాటాలని సూచించారు. అదే విధంగా రోడ్ల వెంట నాటిన మొక్కలకు పాదులు చేసి క్రమం తప్పకుండా నీటిని అందించాలన్నారు. అన్ని గ్రామాల్లో కూలీలకు ఉపాధి హామీ పనులు కల్పించాలని ఈజీఎస్ ఏపీఓ పర్వతాలుకు సూచించారు. డీఆర్డీఓ వెంట టీఏ సింగోటం, పంచాయతీ కార్యదర్శి చందర్, స్థానిక నాయకుడు రతన్‌సింగ్ ఉన్నారు.
అందుబాటులో 1,220 టన్నుల యూరియా
కందనూలు: జిల్లాలో ప్రస్తుతం 1,220 టన్నుల యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ బదావత్ సంతోష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెలలో మరో 3,369 టన్నుల యూరియా జిల్లాకు కేటాయించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో మొక్కజొన్న సాగుకు సంబంధించి యూరియా పంపిణీ దాదాపుగా పూర్తయిందన్నారు. వరిసాగు విస్తీర్ణం గణనీయంగా పెరగడంతో యూరియా డిమాండ్ పెరిగే అవకాశం ఉందని.. అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రణాళికా బద్ధంగా యూరియా పంపిణీ చేయాలని సూచించారు. డీలర్లు యూరియా పంపిణీలో నిబంధనలు పాటించాలన్నారు.
మూల్యాంకన కేంద్రం ఏర్పాటు చేయాలి
కొల్లాపూర్: జిల్లాలో ఇంటర్మీడియట్ మూల్యాంకన కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు కోరారు. ఈ మేరకు బుధవారం కొల్లాపూర్‌లో రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ లెక్చరర్ల సంఽఘం జిల్లా జనరల్ సెక్రెటరీ రవికుమార్, ప్రైవేటు కళాశాలల యాజమాన్య సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సూరగౌని శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్‌లో ఇంటర్ మూల్యాంకనం చేసేందుకు జిల్లాలోని అధ్యాపకులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జిల్లా కేంద్రంలోనే మూల్యాంకన కేంద్రం ఏర్పాటుచేస్తే అందరికీ సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో దశరథం, శ్రీనివాసరావు, కురుమూర్తి పాల్గొన్నారు.
వేరుశనగకు రికార్డుస్థాయి ధర
కల్వకుర్తి రూరల్: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో బుధవారం 664 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి రాగా.. రికార్డు స్థాయిలో ధర లభించింది. కొన్ని రోజులుగా రూ. 9వేల ధర పలికిన వేరుశనగ.. రూ.400 వరకు ధర పెరిగింది. క్వింటాకు గరిష్టంగా రూ. 9,600, కనిష్టంగా రూ. 8,150, సరాసరి రూ. 9,270 ధరలు లభించాయి. అదే విధంగా కందులకు రూ. 6,909 ధర పలికింది. మార్కెట్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్ల ప్రక్రియ చేపట్టినట్లు కార్యదర్శి శివరాజ్ తెలిపారు.
‘పుర’ కమిషనర్ బదిలీ
‘పుర’ కమిషనర్ బదిలీ


