బిల్లుల కోసం నిరీక్షణ | - | Sakshi
Sakshi News home page

బిల్లుల కోసం నిరీక్షణ

Jan 17 2026 9:15 AM | Updated on Jan 17 2026 9:15 AM

బిల్ల

బిల్లుల కోసం నిరీక్షణ

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి బిల్లుల మంజూరు తీవ్ర జాప్యం

బిల్లులు లేక పనులు

ఆగిపోయాయి..

నా ఇంటి నిర్మాణం స్లాబ్‌ వరకు చేరుకుంది. కానీ ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడంతో పనులు చేసే పరిస్థితి లేదు. ఇంటి నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. అధికారులను అడిగినా స్పందించడం లేదు. ప్రభుత్వం విడతల ప్రకారం సకాలంలో బిల్లులు మంజూరుచేయాలి. – కురుమయ్య,

గౌరారం, తెలకపల్లి మండలం

ఇబ్బందులు లేకుండా చూస్తాం..

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు వచ్చేలా ఎప్పటికప్పుడు వివరాలు ఆన్‌లైన్‌ చేస్తున్నాం. సమస్యలు ఉన్నచోట ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. వారం రోజుల్లో లబ్ధిదారులకు బిల్లులు వచ్చే అవకాశం ఉంది. – సంగప్ప,

హౌసింగ్‌ శాఖ ఏడీ, నాగర్‌కర్నూల్‌

సాక్షి, నాగర్‌కర్నూల్‌: ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులకు బిల్లుల మంజూరులో తీవ్ర జాప్యం కొనసాగుతోంది. ప్రభుత్వం నుంచి విడతల వారీగా రూ.5 లక్షల ఆర్థికసాయం అందాల్సి ఉండగా, చాలాచోట్ల నిర్మాణాలు పూర్తయినా బిల్లులు మాత్రం రావడం లేదు. జిల్లాలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించిన లబ్ధిదారులు ప్రభుత్వం అందించే బిల్లుల కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. ఇంటి నిర్మాణానికి డబ్బులు లేక, ప్రభుత్వం నుంచి మంజూరుకాక నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం సకాలంలో బిల్లులు అందిస్తేనే ఇంటి నిర్మాణానికి సాయంగా ఉంటుందని కోరుతున్నారు.

తొలి విడత రూ. లక్షకే పరిమితం..

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను గతేడాది ప్రారంభించారు. చాలాచోట్ల ఇంటి నిర్మాణం ప్రారంభించి 8 నెలలు గడిచినా ఇప్పటివరకు బిల్లులు మంజూరు కాలేదు. ప్రభుత్వం ప్రతీ ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి మొత్తం రూ. 5 లక్షల ఆర్థికసాయాన్ని అందిస్తోంది. ఇందులో ఇంటినిర్మాణం చేపట్టి బేస్‌మెంట్‌ లెవల్‌లో ఉండగా రూ. లక్ష, గోడలు పూర్తయ్యి రూఫ్‌ లెవల్‌లో ఉండగా రూ. లక్ష, స్లాబ్‌ లెవల్‌లో రూ. లక్ష, ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మరో రూ. లక్ష చొప్పున మొత్తం రూ.5 లక్షలను అందించాల్సి ఉంటుంది. ఈ మేరకు లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాల్లోనే విడతల వారీగా జమచేయాల్సి ఉండగా, ఈ ప్రక్రియ తీవ్ర జాప్యం కొనసాగుతోంది. చాలామంది లబ్ధిదారుల ఇంటి నిర్మాణం స్లాబ్‌ లెవల్‌ వరకు చేరుకున్నా రెండో, మూడో విడత బిల్లులు రావడం లేదు. దీంతో డబ్బులు లేక ఇంటి నిర్మాణం మధ్యలోనే ఆగిపోతున్నాయని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.

పెంట్లవెల్లి మండలం మంచాలకట్టలో నిర్మాణంలో

ఉన్న ఇందిరమ్మ ఇల్లు

స్లాబ్‌లెవల్‌లో ఉన్నవి 1,678

చివరి దశలో ఉన్నవి 42

రెండో, మూడో విడత బిల్లుల కోసం నెలల తరబడి ఎదురుచూపులు

డబ్బులు లేక ముందుకు సాగని ఇండ్ల నిర్మాణపనులు

పలుచోట్ల మొదటి విడత బిల్లులకూ నోచుకోని వైనం

బిల్లుల కోసం నిరీక్షణ 1
1/1

బిల్లుల కోసం నిరీక్షణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement