అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
కల్వకుర్తి: నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విద్యుత్, హౌసింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్వకుర్తి ప్రాంతంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఎంత వరకు వచ్చింది.. బిల్లుల పెండింగ్ తదితర వివరాలపై ఆరా తీశారు. వెంటనే బిల్లులు చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ పరిధిలో విద్యుత్ సమస్యలపై అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. పనుల పూర్తికి వెంటనే నివేదిక ఇవ్వాలని కరెంటు సమస్య లేకుండా చేసేందుకు చర్యలు చేపడతామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని వివరించారు.


