ఎగ‘బడి’ పోవాలె..!
● ఫీట్లు.. పాట్లు
●
ఉమ్మడి జిల్లాలో బస్సు సౌకర్యం లేక విద్యార్థుల అగచాట్లు
మా ఊరికి బస్సు లేదు..
నేను నాగర్‌కర్నూల్‌లోని ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నాను. మా ఊరికి బస్సు లేక అందరం ఇబ్బందులు పడుతున్నాం. మా నాన్న రోజూ బైక్‌పై ఎక్కించుకుని స్కూల్‌లో దింపాల్సి వస్తోంది. ఒక్కోసారి 4 కి.మీ. దూరం నడుచుకుంటూ వెళ్తున్నాం. బస్సు సౌకర్యం కల్పిస్తే విద్యార్థులందరికీ ఇబ్బంది లేకుండా ఉంటుంది.
– చైతన్యగౌడ్, పదో తరగతి,
చర్లతిర్మలాపూర్, నాగర్‌కర్నూల్ మండలం
సర్దుబాటు చేస్తున్నాం..
డిపోలోని బస్సులను వీలైన గ్రామాలకు పంపే లా రూట్లను సర్దుబాటు చేస్తున్నాం. మేడారం జాతరకు కొన్ని బస్సులు పంపడం వల్ల గ్రామాల్లో సమస్య నెలకొంది. ప్రత్యామ్నాయంగా బస్సు లను కేటాయిస్తున్నాం. విద్యార్థులకు బస్సులు లేక ఇబ్బందులు ఉన్నచోట మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం.
– యాదయ్య, ఆర్టీసీ డీఎం, నాగర్‌కర్నూల్
ఏయే
గ్రామాలు..
టంకర, కిష్టారం (హన్వాడ), కొత్తపల్లి (మిడ్జిల్),
రామచంద్రపూర్
(మహబూబ్‌నగర్ రూరల్)
నో బస్.. నో సర్వీస్
మహబూబ్‌నగర్ : 4 పల్లెలకు..
జిల్లాలో 423 గ్రామాలు ఉన్నాయి. జిల్లాలో ఒక ఆర్టీసీ డిపో ఉండగా.. దీని పరిధి 45 రూట్లలో బస్సులు నడుస్తున్నాయి. నాలుగు గ్రామాలకు బస్సు సర్వీసులు లేకపోవడంతో ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. టంకర మినహాయించి మూడు గ్రామాలకు చెందిన వారు బస్సులు నడపాలని విజ్ఞప్తులు చేసినా.. అమలు కాలేదు.


