జిల్లావాసులకు అవార్డులు | - | Sakshi
Sakshi News home page

జిల్లావాసులకు అవార్డులు

Jan 25 2026 7:30 AM | Updated on Jan 25 2026 7:30 AM

జిల్లావాసులకు అవార్డులు

జిల్లావాసులకు అవార్డులు

సాక్షి, నాగర్‌కర్నూల్‌: జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ఆదివారం రాష్ట్ర ఎన్నికల సంఘం అవార్డులను అందజేయనుంది. ఈ మేరకు జిల్లాకు చెందిన ఇద్దరు అధికారులు అవార్డును అందుకోనున్నారు. బెస్ట్‌ ఎలక్ట్రోరల్‌ ప్రాక్టీసెస్‌ అవార్డు కింద జిల్లాలోని పెంట్లవెల్లి మండల ఏఈఆర్‌ఓ, అచ్చంపేటకు చెందిన బీఎల్‌ఓ సురేంద్రనాథ్‌ ఎంపికయ్యారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌ లోని రవీంద్ర భారతిలో నిర్వహించే కార్యక్రమంలో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ చేతులమీదుగా అవార్డులు అందుకోనున్నారు.

ప్రజా ప్రభుత్వంలో

యువతకు పెద్దపీట

అచ్చంపేట రూరల్‌: కాంగ్రెస్‌ యువ నాయకుడు రాహుల్‌గాంధీని ప్రధాని చేయడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే వంశీకృష్ణ, యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్‌రెడ్డి అన్నారు. శనివారం అచ్చంపేటలో నిర్వహించిన యూత్‌ కాంగ్రెస్‌ డివిజన్‌ స్థాయి ముఖ్య నాయకుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీకి యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు వెన్నుదన్నుగా ఉన్నారన్నారు. రాబోయే రోజుల్లో యూత్‌ కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్‌ కాంగ్రెస్‌ నాయకులకు 50 శాతం సీట్లను అచ్చంపేట నియోజకవర్గంలో ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే చెప్పారు. యువతకు కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వంలో పెద్దపీట వేస్తున్నామన్నారు. గ్రామ, మండల స్థాయిలో యూత్‌ కాంగ్రెస్‌ కమిటీలను వేసి బలోపేతం చేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement