భక్తిశ్రద్ధలతో వార్షిక బ్రహ్మోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో వార్షిక బ్రహ్మోత్సవాలు

Jan 22 2026 7:49 AM | Updated on Jan 22 2026 7:49 AM

భక్తి

భక్తిశ్రద్ధలతో వార్షిక బ్రహ్మోత్సవాలు

అలంపూర్‌: శ్రీజోగుళాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం మూడో రోజు వైభవంగా కొనసాగాయి. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన పూజలు, త్రిశతి అర్చనలు ప్రత్యేకంగా నిర్వహించారు. అదేవిధంగా విశేష అర్చనలు, చండీహోమాలు, పవమాన సూక్త పారాయణ, పవమాన సూక్త హోమాలు, ఆవాహిత దేవతా హోమాలు, మండప ఆరాధన, బలిహరణ, నీరాజన మంత్రపుష్పములు తదితర పూజలు చేశారు. మరో రెండు రోజుల పాటు వార్షిక బ్రహ్మో త్సవాలు కొనసాగుతాయని ఆలయ ఈఓ దీప్తి తెలిపారు. ఈ నెల 23వ తేదీ ఉత్సవాల చివరి రోజు బ్రహోత్సవాల్లో భక్తులకు అమ్మవారు నిజరూప దర్శనం కలుగుతుందని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలన్నారు.

భక్తిశ్రద్ధలతో వార్షిక బ్రహ్మోత్సవాలు 1
1/1

భక్తిశ్రద్ధలతో వార్షిక బ్రహ్మోత్సవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement