కృష్ణాతీరంలో ఆలయాల అభివృద్ధి కృషి
పెంట్లవెల్లి: కృష్ణానది తీరంలో వెలసిన పురాతన ఆలయాల అభివృద్ధి కృషిచేస్తానని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం ఆయన మండలంలోని జటప్రోల్ గ్రామంలో సురభి రాజవంశస్తులు ప్రతిష్టించిన శ్రీమదనగోపాలస్వామి ఆలయాన్ని ఎన్‌ఆర్‌ఐ ఇన్వెస్టర్ బెంగళూరుకు చెందిన రాజాతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే పేరు పొందేవిధంగా ఈ ఆలయాలను తీర్చిదిద్దుతానని చెప్పారు. ఎంతో గొప్ప చరిత్ర కలిగిన ఈ ఆలయాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా మారుస్తామన్నారు. జటప్రోల్ గ్రామానికి ఉన్న చరిత్ర ఎంతో గొప్పదని, ఒకవైపు పురాతనమైన ఆలయాలు, రాజాగారి కోటలు, చరిత్ర కలిగిన దర్గాలు, సురభి రాజవంశస్తులు పాలించిన సంస్థానం ఈ జటప్రోల్ గ్రామం అన్నారు. కార్యక్రమంలో గోవింద్‌గౌడ్, భీంరెడ్డి, నాగిరెడ్డి, నరేష్, కుర్మయ్య, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.


