4న పాలమూరుకు నితిన్ నబీన్
● ఎంవీఎస్ కళాశాలలో కార్యకర్తలసమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు
● ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ డీకే అరుణ
పాలమూరు: ఫిబ్రవరి 4వ తేదీన మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో ఉమ్మడి జిల్లా బీజేపీ బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా హాజరవుతున్నట్లు ఎంపీ డీకే అరుణ వెల్లడించారు. శనివారం ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానాన్ని బీజేపీ నేతలతో కలిసి ఎంపీ పరిశీలించారు. జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక అయిన తర్వాత తొలిసారిగా తెలంగాణకు అది కూడా పాలమూరు జిల్లాకు రావడం సంతోషకరమన్నారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న పార్టీ నాయకులు, బూత్ కమిటీల సభ్యులు, బూత్ అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, అన్ని రకాల మోర్చా అధ్యక్షులు ఇతర కార్యవర్గం పార్టీ అనుబంధ సంఘాల నాయకులు సమావేశానికి హాజరు కావాలన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రతి ఒక్క బీజేపీ అభ్యర్థిని గెలిపించుకునే విధంగా ప్రతి కార్యకర్త బాధ్యత తీసుకోవాలని, ఈ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయాలన్నారు. రాష్ట్రంలో బీజేపీ బాగా పుంజుకుంటుందని యువత అధికంగా కమలం వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. భవిష్యత్‌లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి రాబోతుందన్నారు. ఆమె వెంట జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి ఇతర నేతలు పాల్గొన్నారు.
4న పాలమూరుకు నితిన్ నబీన్


