కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి
కొల్లాపూర్: పట్టణంలోని పలు వార్డుల్లో రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించి స్థానికులతో మాట్లాడారు. వార్డుల వారీగా జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వారికి వివరించారు. 7వ వార్డులోని శ్రీకృష్ణనగర్‌కాలనీలో యాదవ సంఘం నాయకులతో ఆయన సమావేశం అయ్యారు. శ్రీకృష్ణ మందిరం అభివృద్ధి కోసం రూ.60 లక్షలు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. సోమశిల గండికి వెళ్లే రోడ్డును పరిశీలించి, దాన్ని నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.


