నిత్యం ‘నడక’యాతన.. | - | Sakshi
Sakshi News home page

నిత్యం ‘నడక’యాతన..

Jan 23 2026 9:26 AM | Updated on Jan 23 2026 9:26 AM

నిత్య

నిత్యం ‘నడక’యాతన..

ఆటోలే దిక్కు..

తెలకపల్లి మండలం గౌరారం గ్రామానికి ఆర్టీసీ బస్సు రాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ గ్రామం నుంచి తెలకపల్లిలోని పాఠశాలకు వెళ్లే విద్యార్థులు 15 మంది వరకు ఉన్నారు. గౌరారం నుంచి 2 కి.మీ. దూరంలో ఉన్న గౌరారం గేటు మేయిన్‌ రోడ్డు వరకు కాలినడకన చేరుకొని.. అక్కడి నుంచి బస్సులో ప్రయాణం చేయాల్సి వస్తోంది. తమ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు.

ఈ ఆటోలో కూర్చుని ప్రయాణిస్తున్నది తెలకపల్లి మండలంలోని పర్వతాపూర్‌కు చెందిన విద్యార్థులు. గ్రామానికి ఆర్టీసీ బస్సు రాకపోవడంతో పాఠశాలకు వెళ్లేందుకు నిత్యం ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. సమయానికి పాఠశాలకు చేరుకునేందుకు ఇలా వాహనం సామర్థ్యానికి మించి కిక్కిరిసి ప్రయాణించాల్సి వస్తోంది. బస్సు సౌకర్యం కల్పిస్తే ఇబ్బందులు తొలగుతాయని విద్యార్థులు చెబుతున్నారు.

నిత్యం ‘నడక’యాతన.. 1
1/1

నిత్యం ‘నడక’యాతన..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement