మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం

Jan 23 2026 9:26 AM | Updated on Jan 23 2026 9:26 AM

మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం

మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం

కొల్లాపూర్‌లో

మహిళాశక్తి

భవన నిర్మాణం

రాష్ట్ర ఎకై ్సజ్‌,

పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్‌: రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మెప్మా ఆధ్వర్యంలో గురువారం కొల్లాపూర్‌లోని రాజబంగ్లా వద్ద ఇందిరా మహిళాశక్తి సంబరాలు నిర్వహించగా.. మంత్రి జూపల్లి, కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ హాజరయ్యారు. మున్సిపాలిటీలోని 153 మహిళా సంఘాలకు రూ. 47.15కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కులతో పాటు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. మహిళా సంఘాలతో సోలార్‌ ప్లాంట్లు, పెట్రోల్‌బంకులు ఏర్పాటు చేయించడంతో పాటు ఇతర వ్యాపార రంగాల్లో ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. కొల్లాపూర్‌లో ఇందిరా మహిళాశక్తి భవన నిర్మాణాన్ని త్వరలోనే పూర్తిచేస్తామన్నారు. ప్రభుత్వ పథకాలతో మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని సూచించారు. అనంతరం పట్టణంలోని విద్యుత్‌శాఖ కార్యాలయం వద్ద నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ భవనాన్ని కొన్నేళ్లుగా మున్సిపల్‌ కార్యాలయంగా వినియోగిస్తుండగా.. ఇటీవల సీఎస్‌ఆర్‌ నిధులతో ఆధునికీకరించి గ్రంథాలయాన్ని ఏర్పాటుచేశారు. గ్రంథాలయ సేవలను వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. అదే విధంగా స్థానిక రైతువేదిక వద్ద రైతులకు సబ్సిడీపై మంజూరైన రోటవేటర్లు, స్ప్రే పంపులను మంత్రి జూపల్లి పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో జిల్లా వ్యవసాయశాఖ అధికారి యశ్వంత్‌రావు, ఆర్డీఓ భన్సీలాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement