రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి
నాగర్‌కర్నూల్ క్రైం: వాహనదారులు రోడు భద్రతా నియమాలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణాలు చేయాలని అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఓల్డ్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో వాహన డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ వాహనదారులు రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు హెల్మెట్‌తోపాటు సీట్‌బెల్టు ధరించాలని సూచించారు. అనుకోని రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు కుటుంబాలు రోడ్డున పడతాయన్న విషయం గుర్తించుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో ఏఎంవీఐ అనూప్‌రెడ్డి, ఎంటీఓ రాఘవరావు, డీసీఆర్‌బీ సీఐ ఉపేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.


