న్యాయవాదుల సంక్షేమానికి కృషి
నాగర్‌కర్నూల్ క్రైం: న్యాయవాదుల సమస్యలను పరిష్కరించడంతోపాటు సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని హైకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు రఘునాథ్ అన్నారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నాగర్‌కర్నూల్ కోర్టులో బార్ అసోసియేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదులపై తరుచుగా హత్య ఘటనలు, దాడులు చోటు చేసుకుంటున్నాయని, న్యాయవాదుల రక్షణకు చట్టాన్ని తేవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. న్యాయవాదుల సంక్షేమం, హక్కుల కోసం నిరంతరం కృషిచేస్తానని చెప్పారు. ఆయన వెంట నాగర్‌కర్నూల్, అచ్చంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు రవికాంతరావు, మస్తాన్, న్యాయవాదులు బాలరాజు, రాజేందర్, బృందావన్, ఆంజనేయులు, వెంకటేశ్వర్లు, రవీందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.


