ఈ నెల 26 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు | Telangana Assembly Sessions from February 26 | Sakshi
Sakshi News home page

ఈ నెల 26 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Feb 19 2026 11:04 AM | Updated on Feb 19 2026 11:33 AM

Telangana Assembly Sessions from February 26

హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది.  ఈనెల 26వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమాశాలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఫిబ్రవరి 28వ తేదీన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది తెలంగాణ ప్రభుత్వం.  తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను 10 నుంచి 15 రోజుల పాట నిర్వహించే యోచనలో ఉంది రేవంత్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం.  

దీనిలో భాగంగా బడ్జెట్‌కు సంబంధించి ఆర్థిక శాఖ తుది మెరుగులు దిద్దుతోంది. ఆర్థికశాఖ మల్లు భట్టి విక్రమార్క. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను ఈనెల 28వ తేదీన  అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.  గత బడ్జెట్ కంటే ఈసారి కేటాయింపులు భారీగా ఉండే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు ఈ బడ్జెట్లో పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement