గాయం నుంచి జాతీయ వేదికకు | - | Sakshi
Sakshi News home page

గాయం నుంచి జాతీయ వేదికకు

Feb 19 2026 11:02 AM | Updated on Feb 19 2026 11:02 AM

గాయం నుంచి జాతీయ వేదికకు

గాయం నుంచి జాతీయ వేదికకు

సనత్‌నగర్‌: మోకాలి గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన కబడ్డీ జాతీయ క్రీడాకారిణి రమావత్‌ నందినిని బేగంపేట కిమ్స్‌ సన్‌ షైన్‌ ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కుషాల్‌, డాక్టర్‌ ఆదర్శ్‌ అన్నపరెడ్డి తదితరుల నేతృత్వంలో బుధవారం సన్మానించారు. ఆటగాళ్లకు గాయాలైతే కెరీర్‌ ఆగిపోకుండా, సరైన వైద్యం అందించి ముందడుగు వేసేలా సన్‌షైన్‌ బోన్‌ అండ్‌ జాయింట్‌ ఇన్‌స్టిట్యూట్‌ డాక్టర్ల బృందం కృషి చేస్తోందని ఈ సందర్భంగా డాక్టర్‌ ఏవీ గురువారెడ్డి తెలిపారు. 2022లో నందిని కుడి మోకాలిలో ఏసీఎల్‌ లిగ్మెంట్‌కు గాయమైంది. దీంతో కిమ్స్‌ సైన్‌షైన్‌ షోల్డర్‌ అండ్‌ స్పోర్ట్స్‌ సర్జరీ డైరెక్టర్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌ను సంప్రదించారు. ఏసీఎల్‌ రీకన్‌స్ట్రక్షన్‌ శస్త్రచికిత్స తర్వాత కొన్ని నెలల్లోనే ఆమె మైదానంలోకి దిగగా 2024లో మళ్లీ గాయమైంది. ఈసారి మెనిస్కస్‌ దెబ్బతింది. డాక్టర్‌ చంద్రశేఖర్‌ నేతృత్వంలో డాక్టర్ల బృందం సర్జరీ, రిహాబిలిటేషన్‌ అందించడంతో మూడు నెలల్లోనే కోలుకుంది. 72వ సీనియర్‌ నేషనల్‌ ఉమెన్స్‌ కబడ్డీ చాంపియన్‌షిప్‌కు ఎంపికై ందని డాక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. దీంతో డాక్టర్‌ ఏవీ గురువారెడ్డి నేతృత్వంలో నందినిని సత్కరించారు. క్రీడాకారులకు గాయాలకు సరైన నిపుణుల పర్యవేక్షణలో వైద్యం అందిస్తే కేరీర్‌కు ఇబ్బంది ఉండదని తెలుసుకోవాలన్నారు. భారత కబడ్డీ మాజీ క్రీడాకారుడు డీఎస్పీ వేణుగోపాల్‌, తెలంగాణ బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ పృథ్వీశ్వర్‌రెడ్డి, సీఎస్‌ఎస్‌హెచ్‌ క్లినికల్‌ హెడ్‌ డాక్టర్‌ సుమన్‌ తడగొండ, హైదరాబాద్‌ క్రికెట్‌ అకాడమీ, రంజీ టీం సీనియర్‌ ఫిజియోథెరపిస్ట్‌ డాక్టర్‌ రాజేష్‌, సెంటర్‌ ఫర్‌ స్పైన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ హెల్త్‌ ఫౌండర్‌ సీఈవో, పుల్లెల గోపీచంద్‌ అకాడమీ నరేష్‌కుమార్‌ తదితరులు ఈ కార్యక్రమంలో అనుభవాలను పంచుకున్నారు.

ఏసీఎల్‌ రీకన్‌స్ట్రక్షన్‌ శస్త్రచికిత్సతో పునరాగమనం

కబడ్డీ స్టార్‌ నందినిని సన్మానించిన కిమ్స్‌ సన్‌షైన్‌

Advertisement
 
Advertisement
Advertisement