
సాక్షి, అమరావతి: పాలనాపరమైన కారణాలతో జూన్‌లో జరగాల్సిన పలు లెక్చరర్ పోస్టుల రాత పరీక్షలు వాయిదా పడ్డాయి. ఏపీపీఎస్సీ కార్యదర్శి రాజాబాబు ఈ విషయాన్ని ప్రకటించారు. పరీక్షల నిర్వహణ తేదీలను త్వరలో వెల్లడిస్తామన్నారు. జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులతో పాటు టీటీడీ డిగ్రీ, ఓరియంటల్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ పోస్టులకు జూన్ 16 నుంచి 26వ తేదీ వరకు పరీక్షలు జరగాల్సి ఉన్న సంగతి తెలిసిందే.
వారికి మరో అవకాశం
గ్రూప్–2 మెయిన్స్‌కు అర్హత సాధించినవారిలో యూపీఎస్సీ ప్రిలిమ్స్, ఎఫ్‌ఆర్వో పరీక్షలు రాసేవారికి ధ్రువపత్రాల పరిశీలన కోసం ఏపీపీఎస్సీ జూలై 10 వరకు అదనపు అవకాశం కల్పించింది. తదుపరి తేదీ కోసం అభ్యర్థులు కమిషన్‌ను సంప్రదించాలని కార్యదర్శి సూచించారు.
ప్రశ్నాపత్రాల తయారీ వేతనం పెంపు
ఏపీపీఎస్సీ ప్రశ్నాపత్రాలు తయారు చేసే నిపుణులకు చెల్లించే వేతనాన్ని ప్రభుత్వం పెంచింది. ఆబ్జెక్టివ్ ప్రశ్నాపత్రం, కీ తయారీలో ప్రతి ప్రశ్నకి రూ.150 ఇస్తుండగా, ఆ మొత్తాన్ని రూ.200కి, జవాబు పత్రాల వేల్యూయేషన్ కోసం ఒక్కో స్క్రిప్‌్టకి రూ.100 ఇస్తుండగా, దాన్ని రూ.300కి పెంచారు.