Andhra Pradesh: రేపటి నుంచి ఇంటర్‌ పరీక్షలు | AP Intermediate Examinations Begin from February 23 | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: రేపటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

Feb 22 2026 5:26 AM | Updated on Feb 22 2026 5:26 AM

AP Intermediate Examinations Begin from February 23

నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు

సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. సోమవారం మొదటి ఏడాది, మంగళవారం రెండో ఏడాది విద్యా­ర్థులకు పరీక్షలు మొదలవుతాయి. ఈ ఏడాది మొదటి, రెండో ఏడాది పరీక్షలకు 10,57,312 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరికోసం రాష్ట్రవ్యాప్తంగా 1,537 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రంలో తాగునీరు, విద్యుత్‌ తదితర సదుపాయాలు కల్పించినట్లు బోర్డు కార్యదర్శి పి.రంజిత్‌ బాషా చెప్పా­రు. పరీక్షలు జరిగే గదుల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. కలెక్టర్ల పర్యవేక్షణలో జిల్లా పరీక్ష కమిటీలు, ఫ్లయింగ్, సిట్టింగ్‌ స్క్వాడ్లు తనిఖీలు చే­స్తాయని తెలిపారు. 

విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా అద­నపు బస్సు సర్వీసులు నడపాలని ఆరీ్టసీని కోరామని చెప్పారు. విద్యార్థులు ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశా­రు. గంట ముందే విద్యార్థులు కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. సెల్‌ఫోన్లు, స్మార్ట్‌ వాచ్‌లు, కాలిక్యులేటర్లు, ఎల్రక్టానిక్‌ వస్తువులకు అనుమతి లేద­న్నారు. ఏమైనా సందేహాలు, సమస్యలుంటే విద్యార్థులు 1800–425–­1531­(టోల్‌ ఫ్రీ) నంబర్‌­ను ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించవచ్చని సూ­చించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement