ఏపీ టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే | Ap 10th Class Supplementary Exam Results 2025 Released | Sakshi
Sakshi News home page

ఏపీ టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

Jun 12 2025 6:39 PM | Updated on Jun 12 2025 7:19 PM

Ap 10th Class Supplementary Exam Results 2025 Released

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మే 19 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను అధికారులు ఇవాళ (గురువారం) సాయంత్రం విడుదల చేశారు. మొత్తంగా 1,23,477మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 76.14శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు విద్యాశాఖ ప్రకటించింది.

బాలురలో 73.55 శాతం, బాలికల్లో 80.10 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. విద్యార్థులు ఒకే ఒక్క క్లిక్‌తో www.sakshieducation.comలో త‌మ ఫ‌లితాల‌ను చెక్ చేసుకోవ‌చ్చు. 

👉ఏపీ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు 2025 కోసం క్లిక్ చేయండి

Advertisement
 
Advertisement
Advertisement