
సాక్షి, కాకినాడ: కాకినాడ జిల్లా జీఎన్‌ఎం, ఏఎన్‌ఎం పరీక్షల్లో మాస్ కాపీయింగ్ బట్టబయలైంది. స్లిప్పులు పెట్టుకుని విద్యార్థులు దర్జాగా పరీక్షలు రాశారు. ఆర్‌ఎంసీ కాలేజీలో 1500 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఇన్విజిలేటర్లు ముడుపులు తీసుకుని మాస్ కాపీయింగ్‌కు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
గత రెండు రోజులుగా రంగరాయ మెడికల్ కాలేజీలో జీఎన్‌ఎం, ఏఎన్‌ఎం కోర్సులకు సంబంధించి పరీక్షలు జరుగుతున్నాయి. ఇన్విజిలేటర్లతో పాటు కళాశాల సిబ్బంది కూడా సహకరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


