కామారెడ్డి టౌన్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అరాచక పాలన సాగుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి అడ్డాగా మారింద ని, ఏఐసీసీకి డబ్బు మూటలు పంపేందుకే ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి తాపత్రయ పడుతున్నారని పేర్కొన్నారు. సోమవారం ఆయన కామారెడ్డిలోని బీజేపీ కార్యాలయానికి వచ్చారు. ఇటీవల బాన్సువాడలో చోటు చేసుకున్న ఘటనలో అరైస్టె జైలు పాలైన బాధిత కుటుంబాలను పరామర్శించారు. వారికి కిరాణా సామగ్రిని అందించి, పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. అనంతరం మీడియా తో మాట్లాడారు. రాహుల్ గాంధీకి తెలంగాణ ప్రజ లపై నిజమైన ప్రేమ ఉంటే హైడ్రా బాధితులను, ఖ మ్మం నిర్వాసితులను, దాడులకు గురైన దేవాలయాలను సందర్శించాలని సవాల్ విసిరారు. బా న్సువాడ ఘటనలో పోలీసుల తీరుపై సంజయ్ మండిపడ్డారు. ఏ పాపం తెలియని వ్యక్తులను, కేవ లం కిరాణా సామగ్రి కొనేందుకు వెళ్లిన వారిని కూ డా వీడియోలో ఉన్నారనే సాకుతో అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. హోం శాఖ ముఖ్యమంత్రి వద్దే
ఉన్నా, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ఆయనకు సమాచారం అందడం లేదా అని నిలదీశారు. ఎంఐఎం, ఒవైసీ సోదరుల మెప్పు కోసమే 17 మంది అ మాయక హిందువులపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. హైడ్రా, ఎఫ్టీఎల్ పేరుతో ప్రభుత్వం పేదల ఇళ్లను టార్గెట్ చేస్తోందని సంజయ్ ధ్వజమెత్తారు. పేదల ఇళ్ల జోలికి వస్తే, అదే పొక్లెయిన్‌లతో కాంగ్రెస్ నేతల ఇళ్లను కూలుస్తామని, అప్పుడు శాంతిభద్రతల సమస్య తలెత్తితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అనేక దేవాలయాలపై దాడు లు జరిగాయన్నారు. హిందూ దేవాలయాలపై దా డులు జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేమని పేర్కొన్నారు. హిందూ సమాజం ఇకనైనా జాగృతం కావా లని పిలుపునిచ్చారు. జెండాలు పక్కన పెట్టి హిందూ ధర్మం కోసం ప్రజలు కాషాయ జెండా పట్టి ఏకం కావాలన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, నాయకులు పైడి ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎంఐఎం మెప్పు కోసమే
బాన్సువాడలో అక్రమ అరెస్టులు
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి
బండి సంజయ్ ఆరోపణలు
బాన్సువాడ ఘటన బాధిత
కుటుంబాలకు పరామర్శ


