నిజామాబాద్ రూరల్: జిల్లా కేంద్రానికి చెందిన సా మాజిక సేవాతత్పరుడు మధుసూదన్ దంపతుల ను ఎం–థ్రిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జాదూ యుగంధర్ రంగనాథ్ ఆధ్వర్యంలో పలువురు మంగళవారం ఆయన నివాసంలో ఘనంగా సన్మానించారు. తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర శా ఖ సభ్యుడు కే రామ్మోహన్‌రావు, తపాలా శాఖ వి శ్రాంత ఉద్యోగి కేవీ కృష్ణారావు, రైల్వే మెయిల్ స ర్వీస్ ఉద్యోగి అజయ్ పాల్గొన్నారు.
చిరంజీవాచార్యులకు..
నిజామాబాద్ రూరల్: జిల్లా కేంద్రానికి చెందిన చి రంజీవాచార్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా లో రామలింగేశ్వర ఆలయం సిద్ధేంద్ర యోగి కళాక్షేత్రంలో వారం రోజుల పాటు నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హరికథగా నం, ద్రౌపది స్వయంవరం వినిపించారు. అనంత రం నిర్వాహకులు చిరంజీవాచార్యులను ఘనంగా సన్మానించారు.


