మోపాల్: మండలంలోని సింగంపల్లిలో హోలీ పండుగను పురస్కరించుకుని గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కుస్తీ పోటీలు నిర్వహించారు. పోటీల్లో ఉమ్మడి జిల్లాలోని మద్నూర్, జుక్కల్, బోధన్, బాన్సువాడతోపాటు సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక నుంచి మల్లయోధులు తరలివచ్చారు. పోటీల్లో గెలుపొందిన మల్లయోధుడు ప్రభులాల్‌కు వీడీసీ ప్రతినిధులు రూ.4100 నగదు బహుమతిని అందజేశారు. అలాగే కుస్తీ పోటీల్లో పాల్గొన్న వారికి ప్రోత్సాహక బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ అరికెల సవిత ప్రవీణ్‌రెడ్డి, ఉపసర్పంచ్ గోర్కంటి విజయ్‌రావు, వీడీసీ ప్రతినిధులు మేక మోహన్‌రెడ్డి, గోర్కంటి జయ్, జినిగాల శ్రీనివాస్, గ్రామస్తులు పాల్గొన్నారు.


