యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

Mar 4 2026 7:28 AM | Updated on Mar 4 2026 7:28 AM

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి కార్మికులకు పెరిగిన కరువు భత్యం ఇవ్వాలి

నిజామాబాద్‌ రూరల్‌: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని రూరల్‌ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్‌ అన్నారు. ఒకటో డివిజన్‌ పరిధిలోని భాగ్యనగర్‌ కాలనీలో మత్తు పదార్థాలు, రోడ్డు భద్రతపై కాలనీవాసులకు మంగళవారం అవ గాహన కల్పించారు. యువత మత్తు పదార్థాల కు దూరంగా ఉండాలని అన్నారు. ఎవరైనా మ త్తు పదార్థాలు విక్రయిస్తే పోలీసులకు సమాచా రం అందించాలని వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. కార్యక్రమంలో కాలనీవాసు లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

నిజామాబాద్‌ రూరల్‌: బీడీ కార్మికులకు పెరిగిన కరువు భత్యాన్ని యాజమాన్యాలు చెల్లించాలని తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధిరాములు అన్నారు. నగరంలోని శివాజీనగర్‌లో ఉన్న కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పెరిగిన కరువు భత్యాన్ని బీడీ యాజమాన్యాలు ఏప్రిల్‌ ఒకటి నుంచి వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కరువు భత్యాన్ని చెల్లించకుంటే కార్మికులతో కలిసి పోరాటాలు చేస్తామని అన్నారు. సమావేశంలో నాయకులు రాములు, రేణుకా, వనజ, గంగామణి, బీడీ కార్మికులు పాల్గొన్నారు.

పీసీసీ చీఫ్‌ను కలిసిన యువజన నాయకుడు

కమ్మర్‌పల్లి(భీమ్‌గల్‌): భీమ్‌గల్‌ పట్టణానికి చెందిన యువజన కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు ఆరెపల్లి నాగేంద్రబాబు టీపీసీసీ చీఫ్‌, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డిలను మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల నిర్వహించిన మున్సిపల్‌ ఎన్నికల్లో నాగేంద్రబాబు సతీమణి శ్రీజ 1వ వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికై ంది. ఈ నేపథ్యంలో టీజీఎండీసీ చైర్మన్‌ ఈరవత్రి అనిల్‌కుమార్‌, రాష్ట్ర సహకార యూనియన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ మానాల మోహన్‌రెడ్డితో కలిసి మంగళవారం హైదరాబాద్‌లో వారిని కలిసి సత్కరించారు. భీమ్‌గల్‌ పట్టణాభివృద్ధికి కృషి చేస్తామని మహేశ్‌కుమార్‌గౌడ్‌, సుదర్శన్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు నాగేంద్రబాబు తెలిపారు.

ట్రంప్‌ దిష్టిబొమ్మ దహనం

బోధన్‌: ఇరాన్‌ దేశంపై అమెరికా, ఇజ్రాయిల్‌ దేశా ల దాడిని ఖండిస్తూ మంగళవారం ఎడపల్లి మండల కేంద్రంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం నాయకులు అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు గుమ్ముల గంగాధర్‌ మాట్లాడుతూ.. ఇరాన్‌ పై యుద్ధం వెంటనే ఆపాల ని డిమాండ్‌ చేశారు. పశ్చిమ ఆసియాలో ఆయిల్‌ పై ఆధిపత్యం కోసమే ఇరాన్‌పై అమెరికా యుద్ధానికి దిగిందన్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌ దేశ అధ్యక్షుడు అయతొల్లా అలీ ఖమేనీని క్షిపణులతో దాడి చేసి హత్య చేసిందని పేర్కొన్నారు. ప్రపంచం వాణిజ్యం, రాజకీయ ఆధిపత్యం కోసం అమెరికా చిన్న దేశాలపై దురాక్రమణకు పాల్పడుతుందని ఆరోపించారు. నాయకులు సుల్తాన్‌ సాయిలు, రవి, పోశెట్టి, హన్మాండ్లు, సుదర్శన్‌, గంగాధర్‌, భూమయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement