ఉగాది ఉత్సవాలను విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఉగాది ఉత్సవాలను విజయవంతం చేయాలి

Mar 4 2026 7:28 AM | Updated on Mar 4 2026 7:28 AM

నిజామాబాద్‌ రూరల్‌ : ఉగాది ఉత్సవాలను విజయవంతం చేయాలని వ్యాసపురి కన్యకా పరమేశ్వరి చారిటబుల్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడు మూడ నాగభూషణం గుప్తా అన్నారు. మంగళవారం ట్రస్ట్‌ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ సంస్థ ఇందూరు యజ్ఞ సమితి వ్యాసపురి కన్యకా పరమేశ్వరి చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది నిఖిల్‌ సాయి హోటల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం, సాహిత్య పురస్కారాలు, అతిథుల సత్కారాలు ఉంటాయన్నారు. తెలుగు సాహిత్య అభిమానులు, కవులు, కళాకారులు, నగర పురప్రముఖులు పెద్ద ఎత్తున హాజరై వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సభ్యులు దారం గంగాధర్‌, డాక్టర్‌ కాసర్ల నరేశ్‌ రావు, డాక్టర్‌ గంట్యాల ప్రసాద్‌, తొగర్ల సురేశ్‌, డాక్టర్‌ మద్దుకూరి సాయిబాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement