సిరికొండ : మండల కేంద్రంలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు వన్యప్రాణులపై అవగాహన కల్పించారు. సిరికొండ ఎఫ్‌ఆర్‌వో నర్సింగ్‌రావు మాట్లాడుతూ.. అడవులను సంరక్షించడం ద్వారా వన్యప్రాణులను కాపాడవచ్చని తెలిపారు. అడవులు తరగిపోతే వన్యప్రాణుల మనుగడ కష్టమన్నారు. వన్యప్రాణులను జాతీయ సంపదగా భావించి ప్రతి పౌరుడు వాటిని కాపాడాలని తెలిపారు. పై విషయాలను తల్లిదండ్రులకు వివరించాలని విద్యార్థులకు సూచించారు. సమావేశంలో డీఆర్వో గంగారాం, రావుట్ల సెక్షన్ అధికారి లచ్చయ్య, బీట్ అధికారులు, బేస్ క్యాంపు సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


