కోరిన కోరికలు నెరవేరాలని పరమేశ్వరుడిని వేడుకుంటూ ఎన్నో ఆశలతో కట్టిన ముడుపులు ఇవి. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం శివలింగేశ్వరస్వామి మర్రిచెట్టు దేవస్థానానికి వచ్చే భక్తులు స్వామి తమ కోరికలను నెరవేరుస్తాడని, కష్టాల నుంచి గట్టెక్కిస్తాడని విశ్వాసంతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలాగే అక్కడే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇనుప రాడ్లకు కొబ్బరికాయ ముడుపులు కడుతారు. భక్తుల కడుతున్న ముడుపుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్


