పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

Mar 2 2026 7:21 AM | Updated on Mar 2 2026 7:21 AM

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి

బాన్సువాడ: పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం బాన్సువాడలోని తన నివాసంలో బాన్సువాడ పట్టణం, బాన్సువాడ గ్రామీణం, బీర్కూర్‌, నస్రూల్లాబాద్‌ మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చే స్తుందని,ఆడపిల్లలకు పెళ్లి చేయలేక ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న పేదలకుకల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల ద్వారా ఆర్థిక సాయం అందించి ప్రభుత్వం భరోసా ఇస్తుందని అన్నారు. బాన్సువాడ గ్రామీణంలో 54, బాన్సువాడ పట్టణంలో 30, నస్రుల్లాబాద్‌లో 74, బీర్కూర్‌లో 20 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ రేష్మబేగం, కౌన్సిలర్లు రుక్మిణీ, రాజశేఖర్‌, హకీం, కాంగ్రెస్‌ నాయకులు కృష్ణారెడ్డి, ఎజాస్‌, మోహన్‌నాయక్‌, గోపాల్‌ రెడ్డి, నార్ల రవీందర్‌, నర్సగొండ, సలీం తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement