న్యూస్‌రీల్
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి బృందం..
నిజామాబాద్
మార్కెట్ యార్డుకు పోటెత్తిన పసుపు
ఇస్రో ఆహ్వానం..
విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందు కు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘యువికా’ కార్యక్రమాన్ని చేపడుతోంది.
శుక్రవారం శ్రీ 6 శ్రీ మార్చి శ్రీ 2026
– 10లో u
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల నుంచి నిజామాబాద్ జిల్లాలోకి వచ్చిన పెద్ద పులి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల క్రితం జిల్లాలోని కమ్మర్‌పల్లి అటవీ క్షేత్రం పరిధిలోకి వచ్చిన ఈ పెద్ద పులి అదే రేంజ్‌లో తిరుగుతున్నట్లు అటవీ అధికారులు నిర్ధారణకు వచ్చారు. కోనాపూర్ సెక్షన్‌లోని ఇనాయత్‌నగర్ బీట్ పరిధిలో ఉన్న గట్టుపొడిచిన వాగు ప్రాజెక్టు సమీపంలో జలాశయం ప్రాంతంలో ఈ పులి తిష్ట వేసుకుని ఉంది. గురువారం తెల్లవారుజామున అటవీ శాఖ అమర్చిన ట్రాప్ కెమెరాకు పెద్ద పులి కదలికలు చిక్కడంతో కచ్చితమైన నిర్ధారణ అయింది. హారాష్ట్రలోని తాడోబా అడవి నుంచి వచ్చిన ఈ పులి గత కొన్ని నెలలుగా ఆదిలాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల్లో సంచరిస్తూ వచ్చింది. యాదాద్రి జిల్లా అటవీ ప్రాంతం వరకు వెళ్లి మళ్లీ తిరుగు ప్రయాణంలో ఉన్న ఈ పులి జగిత్యాల జిల్లా మీదుగా నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్‌పల్లి రేంజ్‌లోకి వచ్చింది. ప్రస్తుతం కమ్మర్‌పల్లి అటవీ రేంజ్ అధికారి రవీందర్ ఆధ్వర్యంలో 18 మంది మూడు బృందాలుగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.
30 మీటర్ల దూరంలో..
ఆరుగురితో కూడిన అటవీ అధికారుల బృందం గట్టుపొడిచిన వాగు బ్యాక్‌వాటర్ ప్రాంతంలో గురువారం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సందర్భంలో బీట్ అధికారి శ్రీదేవికి అలసట రావడంతో అక్కడే ఉన్న కల్వర్టు మీద కూర్చుంది. బృందంలోని మిగిలిన సభ్యులు కొంత మేర ముందుకు వెళ్లారు. ఇదే సమయంలో వెనుక వైపు 30 మీటర్ల దూరంలో ఆకుల అలికిడి వినిపించడంతో శ్రీదేవి ఆవైపు చూసింది. పెద్ద పులి నడిచి వెళుతూ కనిపించింది. దీంతో ఆమె అక్కడికక్కడే మూర్ఛపోయింది. కల్వర్టుకు ఇవతలివైపు పడిపోయింది. శ్రీదేవి కనిపించకపోవడంతో అధికారుల బృందం తిరిగి వచ్చి చూడగా ఆమె మూర్చపోయి ఉంది. తక్షణమే శ్రీదేవిని ఆస్పత్రికి తరలించారు. ఆమె పులిని మధ్యాహ్నం సమయంలో చూడగా రాత్రి అయినప్పటికీ షాక్ నుంచి కోలుకోలేదు. కల్వర్టుకు అవతలివైపు పడిపోయి ఉంటే పులికి ఆహారం అయ్యేదానినని శ్రీదేవి ఏడుస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ ఘటనతో ఇతర అధికారులు సైతం భయాందోళనలకు గురవుతున్నారు.
టైగర్ రిలాక్స్!
నెలల తరబడి వివిధ జిల్లాల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో తిరుగుతూ వచ్చిన ఈ మగ పెద్ద పులి ఆడ పులి తోడు కోసం తిరుగుతోంది. వందల కిలోమీటర్ల మేర తిరుగుతూ వచ్చిన ఈ పులి కమ్మర్‌పల్లి రేంజ్ పరిధిలోని గట్టుపొడిచినవాగు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రాంతంలో తిష్ట వేసుకుని ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. నెలలపాటు తిరిగిన పులి ఇక్కడ రిలాక్స్ అవుతున్నట్లు అంచనా. మూ డు రోజుల క్రితం ఇక్కడకు వచ్చిన ఈ పులి ఇదే చోట వన్యప్రాణని చంపి తిని, ఇక్కడే దాహార్తిని తీర్చుకుని విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
● వన్యప్రాణుల దాహార్తి తీర్చడంలో భాగంగా ఉమ్మడి ఏపీలో జలయజ్ఞం కార్యక్రమంలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో నిర్మించిన మొదటి ప్రాజెక్టు గట్టుపొడిచినవాగు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు జలాశయంలోని నీరు సాగునీటికి సైతం ఉపయోగపడుతున్నాయి. ఇందుకోసం ఎత్తిపోతల పథకం, కాలువలు నిర్మించారు.
● జిల్లాలోకి ఈ నెల 3న ప్రవేశించిన పెద్ద పులి పాద ముద్రలను గట్టుపొడిచినవాగు సమీపంలోని అటవీ ప్రాంతంలో అధికారులు గుర్తించారు. ఈ పులి పాద ముద్రలు 19 సెంటీమీటర్ల మేర ఉండడంతో మగపులిగా అధికారులు నిర్ధారించారు. ఇదే ప్రాంతంలో పలుచోట్ల పులి పాద ముద్రలు కనిపించడం గమనార్హం. అటవీ అధికారులు, సిబ్బంది నిరంతరం పెట్రోలింగ్ చేస్తూ వస్తున్నారు. సమీప ప్రాంతాల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. పెద్ద పులి కచ్చితంగా గట్టుపొడిచినవాగు ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ప్రాంతంలోనే ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇక్కడ ఆహారం కోసం వన్యప్రాణుల లభ్యత, వేసవి కావడంతో దాహార్తిని తీర్చుకునేందుకు పుష్కలంగా నీటి సౌకర్యం ఉండడంతో పులి ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నట్లు భావిస్తున్నారు.
వేం నరేందర్‌రెడ్డికి శుభాకాంక్షలు
తెలిపిన నగేష్‌రెడ్డి
సుభాష్‌నగర్: తెలంగాణ నుంచి కాంగ్రె స్ అభ్యర్థిగా రాజ్యసభ స భ్యత్వానికి నా మినేషన్ వేసి న వేం నరేందర్‌రెడ్డికి డీసీసీ అధ్యక్షుడు కాట్‌పల్లి నగేష్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గు రువారం హైదరాబాద్‌లోని తన నివాసంలో నరేందర్‌రెడ్డిని నగేష్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్ఫగుచ్ఛం అందజేశారు. ఈసందర్భంగా నగేష్‌రెడ్డి మాట్లాడుతూ.. వేం న రేందర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికకానుండడం హర్షణీయమని అన్నారు.
రంజాన్ ఉపవాసాలతో
సహనం, క్రమశిక్షణ
నిజామాబాద్ అర్బన్: రంజాన్ ఉపవాసాల తో నియమం, సహనం, క్రమశిక్షణ పెంపొందుతాయని సీపీ సాయిచైతన్య అన్నా రు. నగరంలోని కచ్చియాన్ మసీద్‌లో గురువారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ కేవలం ఉపవాసాల నెల మా త్రమే కాకుండా, మనస్సును పరిశుభ్రం చే సుకునే ఆత్మపరిశీలన కాలమని అన్నారు. ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, సీఐ ప్రసాద్, వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి, కచ్చియాన్ మసీద్ ప్రెసిడెంట్ యాసీన్ పాల్గొన్నారు.
నేడు బీజేపీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు
అభినందన సభ
సుభాష్‌నగర్: నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లో గెలుపొందిన బీజేపీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు శుక్రవారం నగరశివారులోని కమ్మసంఘంలో అభినందన సభ ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే పార్లమెంట్ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యఅతిథులుగా మల్కాజిగిరి, నిజామాబాద్ ఎంపీలు ఈట ల రాజేందర్, అర్వింద్ ధర్మపురి, ఎమ్మె ల్యేలు ధన్‌పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్‌రెడ్డి, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతిరెడ్డి, జిల్లా ప్రభారి కాంతారావు హాజరవుతారని తెలిపారు. జిల్లా పదాధికారులు, రాష్ట్ర, జిల్లా నాయకులు, మోర్చాల జిల్లా పదాధికారులు, మండలాల అధ్యక్షులు, మండల పదాధికారులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సకాలంలో హాజరై విజయవంతం చేయాలని దినేశ్ కోరారు.
పెద్ద పులి కదలికలు కనిపెట్టడంతో పాటు అది ఎటువైపు వెళ్తుందో గమనించేందుకు గాను అ టవీ శాఖ అధికారులు పలు చోట్ల ట్రాప్ కెమెరా లు ఏర్పాటు చేశారు. గట్టుపొడిచినవాగు ప్రాంతంలో కనిపించడంతో అటవీ యంత్రాంగం మరింత అలర్ట్ అయింది. మహారాష్ట్ర నుంచి మొదటగా ఆదిలాబాద్ జిల్లా ద్వారానే తెలంగాణలోని వివిధ జిల్లాల్లోని అటవీ ప్రాంతంలో సంచరిస్తూ వచ్చిన ఈ పులి ఇక్కడ తిష్ట వేసి నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి సైతం అటవీ అధికారుల బృందాలు జిల్లాకు వచ్చాయి. డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేసి పెద్ద పులి కదలికలను పూర్తి స్థా యిలో గుర్తించేందుకు అటవీ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. డీఎఫ్‌వో వికాస్‌మీనా నిర్మల్ జిల్లా ఖానాపూర్ నుంచి తెప్పించిన డ్రోన్ కెమె రా ద్వారా రెండు కిలోమీటర్ల రేడియస్‌లో పరిశీలించారు. అయితే పులి జాడ కనిపించలేదు.
నేడు జిల్లాస్థాయి
ఆర్చరీ పోటీలు
మోపాల్: మండలకేంద్రం శివారులోని ఏకలవ్య ఆర్చరీ అకాడమీలో జిల్లాస్థాయి ఆర్చరీ పోటీలను శుక్రవారం నిర్వహించనున్నట్లు ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడు ఈగ సంజీవ్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి గంగరాజు, కోచ్ ఎన్ రవీందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో ఎంపికై న వారు 8వ తేదీన జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. అండర్ – 10, 13, 15 విభాగాల నుంచి ఉమ్మడి జిల్లా క్రీడాకారులు పాల్గొనవచ్చన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు జిల్లాస్థాయి పోటీలకు హాజరుకావాలని, ఉదయం 8 గంటల లోగా ఏకలవ్య ఆర్చరీ అకాడమీలో క్రీడాకారులు రిపోర్ట్ చేయాలని కోరారు.
సుభాష్‌నగర్: నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్‌యార్డుకు పసుపు పోటెత్తింది. వరుస సెలవుల తర్వాత ప్రారంభమైన శ్రద్ధానంద్ గంజ్‌కు గురువారం ఒక్కరోజే దాదాపు 60 వేల బస్తాల వరకు పసుపు పంట వచ్చినట్లు అధికారులు తెలిపారు. సీజన్ మొదలైన రెండు నెలల్లో మార్కెట్‌కు పసుపు రావడం ఇదే అత్యధికమని అన్నారు. రెండు నెలల్లో గంజ్‌కు సుమారు 2 లక్షల క్వింటాళ్ల పసుపు వచ్చిందని తెలిపారు. ఈ సీజన్‌లో క్వింటాల్‌కు రూ.15,650కు పైచిలుకు ధర పలికిందన్నారు. తేమశాతం 12 ఉండేలా నాణ్యమైన పసుపు తీసుకురావాలని రైతులు వారు సూచించారు.
గట్టుపొడిచిన వాగు వద్ద తిష్ట
జంతువులను వేటాడి చంపి తిని విశ్రాంతి
డ్రోన్ కెమెరాలతో పులి కదలికలను
గుర్తించేందుకు అటవీశాఖ ప్రయత్నాలు
పులిని చూసి కళ్లు తిరిగి
మూర్చపోయిన బీట్ అధికారి శ్రీదేవి


