బోధన్: హైదరాబాద్‌కు చెందిన గ్లోబల్ ఫౌండేషన్, వసుంధర విజ్ఞాన వికాస మండలి ఆధ్వర్యంలో ప్రతి ఏటా వివిధ రంగాల్లోని ప్రతిభావంతులకు జాతీయ స్థాయి అవార్డును అందిస్తుంది. చిత్ర కళలో రాణిస్తున్న బోధన్ పట్టణం తట్టికోట కాలనీకి చెందిన చిత్రకారిణి ఎర్రోల్ల అవంతి ‘బాపు చిత్ర కళారత్న’ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ నెల 26న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించే అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో నిర్వాహకుల చేతుల మీదుగా అవంతి అవార్డును అందుకోనున్నారు. సాలూర మండల కేంద్రానికి చెందిన ప్రముఖ ఆర్టిస్ట్ లింబూరి లక్ష్మణ్ ప్రోత్సాహంతో ఇంటర్ చదువుకుంటూనే అవంతి డ్రాయింగ్ డిప్లొమాలో లోయర్, హయ్యర్ పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జాతీయ స్థాయి అవార్డుకు ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. ఇటీవల ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా 15 అడుగుల ఎత్తు గల క్లాథ్ బ్యానర్‌పై శివాజీ చిత్రం గీశానని పేర్కొంది.


