మస్కట్‌లో ఆలూర్‌ వాసి మృతి | - | Sakshi
Sakshi News home page

మస్కట్‌లో ఆలూర్‌ వాసి మృతి

Mar 5 2026 7:41 AM | Updated on Mar 5 2026 7:41 AM

పెర్కిట్‌: ఆలూర్‌ మండల కేంద్రానికి చెందిన అండ్రాసి మల్లయ్య(45) మస్కట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు గ్రామస్తులు బుధవారం తెలిపారు. ఆలూర్‌ మండల కేంద్రానికి చెందిన మల్లయ్య ఉపాధి కోసం గల్ఫ్‌ దేశమైన మస్కట్‌ వెళ్లాడు. మంగళవారం పని ముగించుకుని రోడ్డు దాటుతుండగా కారు వేగంగా వచ్చి ఢీకొన్నది. దీంతో మల్లయ్య ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయ్యాడు. మల్లయ్యకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.

కేసు నమోదు

మోపాల్‌: మండలంలోని ముదక్‌పల్లి గ్రామశివారులో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై జాడె సుస్మిత గురువారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మంచిప్ప గ్రామానికిచెందిన కమ్మరి రాజు ఈనెల 2న సాయంత్రం ఆటోను నిర్లక్ష్యంగా నడిపి అదేసమయంలో బైక్‌పై వస్తున్న కొండెంగల శ్యామ్‌ను ఢీకొన్నాడు. ప్రమాదంలో శ్యామ్‌ కులి కాలి వేళ్లు, మోకాలి వద్ద గాయాలయ్యాయి. శ్యామ్‌ సోదరుడు వెంకటేశ్‌ ఫిర్యాదు మేరకు కమ్మరి రాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు.

304.70 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

డిచ్‌పల్లి: మండలంలోని ధర్మారం(బి) గ్రామంలో ఉన్న శ్రీగణేశ్‌ రైస్‌మిల్‌ లో అక్రమంగా నిర్వహించిన 304.70 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని స్వాధీ నం చేసుకొని కేసు నమోదు చేసినట్టు డిచ్‌పల్లి ఎస్సై ఆరిఫ్‌ తెలిపారు. ఎ స్సై తెలిపిన వివరాల ప్రకారం.. గణేష్‌ రైస్‌ మిల్లు రేషన్‌ బియ్యాన్ని అక్ర మంగా రవాణా చేస్తున్నారని అందిన సమాచారం మేరకు పోలీస్‌, సివిల్‌ సప్లై డీటీ రాథోడ్‌ రవికుమార్‌, టాస్క్‌ ఫోర్స్‌ సిబ్బంది మంగళవారం రా త్రి దాడి నిర్వహించారు. రైస్‌ మిల్‌ యజమాని గందె నాగరాజును విచారించగా రేషన్‌ బియ్యానికి సంబంధించిన ఎలాంటి పత్రాలు చూయించ లేదు. ఈ దాడిలో 304.70 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం స్వాధీనం చేసుకోగా వీటి విలువ రూ.11,57,860 ఉంటుందని తెలిపారు. డీటీ రవికుమార్‌ ఫిర్యాదు మేరకు రైస్‌ మిల్‌ యజమాని నాగరాజు, చీల రోహిత్‌, సీహెచ్‌ కిరణ్‌ కుమార్‌, ఆటో డ్రైవర్లు షేక్‌ రఫీ, షేక్‌ అన్సర్‌, షేక్‌ గౌస్‌పై కేసు నమోదు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement