రూ.151కే సీతారాముల కల్యాణ తలంబ్రాలు | - | Sakshi
Sakshi News home page

రూ.151కే సీతారాముల కల్యాణ తలంబ్రాలు

Mar 5 2026 7:41 AM | Updated on Mar 5 2026 7:41 AM

రూ.151కే సీతారాముల కల్యాణ తలంబ్రాలు హౌస్‌ ట్యాక్స్‌ కట్టు.. గిఫ్ట్‌ పట్టు కొనసాగుతున్న ఎల్‌ఎల్‌బీ సెమిస్టర్‌ పరీక్షలు

సుభాష్‌నగర్‌: భద్రాచలంలో ఈ నెల 27న నిర్వహించే సీతారాముల వారి కల్యాణానికి వెళ్లలేని భక్తులకు కేవలం రూ.151కే కల్యాణ తలంబ్రాలు ఇంటి వద్దకే అందించే ఏర్పాట్లు ఆర్టీస చేపట్టిందని నిజామాబాద్‌ డిపో–1 మేనేజర్‌ ఆనంద్‌ తెలిపారు. ఈమేరకు బుధవారం నగరంలోని డిపో కార్యాలయంలో కల్యాణ తలంబ్రాలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కల్యాణ తలంబ్రాల కోసం

సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్లు

ఆర్మూర్‌ డిపో– 73968 89496

బోధన్‌ డిపో – 91542 98729

నిజామాబాద్‌ – 1 91542 98727

నిజామాబాద్‌ – 2 73968 89496

బాన్సువాడ – 91542 98729

కామారెడ్డి డిపో – 91542 98729

ఆర్‌ఎం ఆఫీస్‌ – 86399 69647

ఇంటిపన్ను చెల్లించిన వారికి

లక్కీ డ్రా ద్వారా బహుమతులు

కమ్మర్‌పల్లి: మండలంలోని బషీరాబాద్‌లో సకాలంలో ఇంటి పన్ను చెల్లించిన వారికి లక్కీ డ్రా ద్వారా బహుమతులు అందజేశారు. జీపీ నూతన పాలకవర్గం కొలువుదీరిన సమయంలో సర్పంచ్‌ బైకానీ జమున, అధికారులు కలిసి 2025–26 సంవత్సరానికి గాను సకాలంలో ఇంటి పన్ను, పన్ను బకాయిలు చెల్లించిన వారికి లక్కీ డ్రా ద్వారా బహుమతులు అందజేస్తామని ప్రకటించారు. బుధవారం జీపీ ఆవరణలో గ్రామసభ నిర్వహించిన అనంతరం గ్రామస్తుల సమక్షంలో ఇంటి పన్ను చెల్లించిన 534 మంది చెల్లింపుదారుల ఇంటి నంబరు, పేరుతో కలిసి డ్రా పద్ధతిన విజేతలను ఎంపిక చేశారు. డ్రా లో సుంకెట చిన్న గంగారాం సీలింగ్‌ ఫ్యాన్‌, బొక్కెన శోభ హెల్మెట్‌, సుంకెట పెద్ద ముత్తెన్న రైస్‌ కుక్కర్‌ గెలుపొందారు. తహసీల్దార్‌ జీ ప్రసాద్‌, ఆర్‌ఐ శరత్‌, ఉపసర్పంచ్‌ చిలివేరి భూమేశ్వర్‌, కార్యదర్శి నరేందర్‌, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న ఎల్‌ఎల్‌బీ ఐదో సెమిస్టర్‌ రెగ్యులర్‌ థియరీ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ఘంటా చంద్రశేఖర్‌ తెలిపారు. మధ్యాహ్నం నిర్వహించిన ఈ పరీక్షకు 28 మందికి 27 మంది హాజరు కాగా ఒక విద్యార్థి గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement