● ఘనంగా లైన్‌మన్ దివస్
● సిబ్బందికి ప్రశంసాపత్రాల అందజేత
సుభాష్‌నగర్/సిరికొండ : ఎన్‌పీడీసీఎల్ సంస్థలో క్షేత్రస్థాయిలో లైన్‌మన్ల సేవలు అభినందనీయమని డీఈలు అల్జాపూర్ రమేశ్, వెంకటరమణ కొనియాడారు. బుధవారం నగరంలోని ఎంఆర్‌టీ కన్‌స్ట్రక్షన్ డివిజన్, డీ–2, 3, 5, 9, బోర్గాం(పి) సెక్షన్‌లో టెస్టర్ గ్రేడ్–1, 2, జూనియర్ లైన్‌మన్, ఆర్టిజన్‌లను పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. అనంతరం ప్రశంసాపత్రాలతో సన్మానించారు. అనంతరం వారితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఏడీఈలు తోట రాజశేఖర్, ప్రదీప్‌రెడ్డి, ఏఈలు గయాస్ అహ్మద్, బాబా శ్రీనివాస్, జాకీర్ అలీ, మౌనిక రెడ్డి, రజిని, ఫోర్‌మెన్లు, లైన్ ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. సిరికొండ విద్యుత్ శాఖ కార్యాలయంలో లైన్‌మన్లను మేన్లను కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాకారం రవి, సిరికొండ సెక్షన్ ఏఈ చంద్రశేఖర్ ఘనంగా సన్మానించారు.సబ్ ఇంజనీర్ గంగారాం సిబ్బంది పాల్గొన్నారు.
ఎంఆర్‌టీలో లైన్‌మన్లను సన్మానించిన
డీఈ, ఏడీఈ, ఏఈలు
డీ–5 సెక్షన్‌లో లైన్‌మన్లను సత్కరించి
ప్రశంసాపత్రాలు అందజేసిన డీఈ, ఏడీఈ, ఏఈలు


