విధులు ఎగ్గొట్టేవారిపై నిఘా సారించాలి | - | Sakshi
Sakshi News home page

విధులు ఎగ్గొట్టేవారిపై నిఘా సారించాలి

Mar 1 2026 7:27 AM | Updated on Mar 1 2026 7:27 AM

విధులు ఎగ్గొట్టేవారిపై నిఘా సారించాలి

విధులు ఎగ్గొట్టేవారిపై నిఘా సారించాలి

నిజామాబాద్‌ రూరల్‌: కొంతమంది సిబ్బంది విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని, విచారణ చేపట్టి చర్యలు తీసుకోవా లని అధికారులకు ప్రభుత్వ సలహాదారు, బోధన్‌ ఎమ్మెల్యే పి సుదర్శన్‌రెడ్డి సూచించారు. ప్రత్యేకించి బయో మెట్రిక్‌ హాజరు వేసుకుని వెళ్లిపోతున్న సి బ్బందిపై నిఘా సారించాలన్నారు. జిల్లా కేంద్రంలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్‌), క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ల భవన సముదాయాన్ని పరిశీ లించారు. సుదీర్ఘకాలం నుంచి పలు పనులు పెండింగ్‌ లోనే ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జీజీహెచ్‌లో కొనసాగుతున్న ప్రసూ తి సేవల విభాగాన్ని వెంటనే ఎంసీహెచ్‌లోకి మా ర్చాలని ఆదేశించారు. అనంతరం జీజీహెచ్‌లో ఆ స్పత్రి పనితీరుపై సంబంధిత వైద్యులతో సమీక్షించారు. కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, పోలీస్‌ కమిషనర్‌ సాయిచైతన్య పాల్గొన్నారు.

ఒక్కో విభాగం వారీగా రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న డాక్టర్లు, సిబ్బంది ఖాళీలు, కొత్తగా అందుబాటులోకి వచ్చిన సౌకర్యాలు, సమకూర్చాల్సి సదుపాయాలు తదితర వివరాలను ఆయా విభాగాల అధిపతుల ద్వారా సుదర్శన్‌రెడ్డి తెలుసుకున్నారు. వైద్య సేవలను మరింతగా మెరుగుపర్చాలని, అవసరమైన అన్ని వసతులు సమకూరుస్తామని సూచించారు. వైద్య సేవల కోసం ప్రతిరోజూ 2వేల మంది వరకు అవుట్‌ పేషంట్‌లు జీజీహెచ్‌కు వస్తున్నారని, అన్ని విభాగాల పనితీరు మెరుగుపడాలని అన్నారు. వైద్యులతోపాటు సిబ్బంది, అధునాతన వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రజలు జీజీహెచ్‌ సేవలను వినియోగించుకోవాలని సూ చించారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా జీజీహె చ్‌లో కీలు మార్పిడి శస్త్రచికిత్స చేస్తున్నారన్నారు. వి ద్య, వైద్య రంగాల పని తీరును మరింత మెరుగుపర్చాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని అన్నారు. సమీక్షలో డీఎంహెచ్‌వో రాజశ్రీ, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, డాక్టర్‌ రాము లు, వివిధ విభాగాల వైద్యాధికారులు పాల్గొన్నారు.

వైద్య సేవలు మరింత మెరుగుపడాలి

జీజీహెచ్‌లో వైద్యులు, సిబ్బందితోపాటు అధునాతన పరికరాలు

ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి

ఎంసీహెచ్‌, క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ భవన సముదాయం పరిశీలన

జీజీహెచ్‌లో సమీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement