రోగులకు మెరుగైన సేవలందించాలి | - | Sakshi
Sakshi News home page

రోగులకు మెరుగైన సేవలందించాలి

Mar 2 2026 7:26 AM | Updated on Mar 2 2026 7:26 AM

రోగుల

రోగులకు మెరుగైన సేవలందించాలి

రోగులకు మెరుగైన సేవలందించాలి ‘స్కిల్‌ ఫియెస్టా’ వర్క్‌షాప్‌ బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం హైమాస్ట్‌ లైట్‌ ప్రారంభం నేడు గడ్కోల్‌లో ఆత్మీయ సమ్మేళనం

సిరికొండ: ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌బిన్‌ హందాన్‌ సూచించారు. మండల కేంద్రంలో జిల్లా కేంద్రానికి చెందిన ఓ ప్రైవేటు ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. తాహెర్‌ ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఆస్పత్రికి చెందిన వైద్యులు రోగులను పరీక్షించి ఉచితంగా మందులను అందజేశారు. సర్పంచ్‌ సాయిలు, ఉపసర్పంచ్‌ శోభన్‌, వైద్యులు పాల్గొన్నారు.

ఖలీల్‌వాడి: నగరంలోని ఎల్లమ్మగుట్టలోని అమ్మనగర్‌లోని నిశిత ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో ఆధునిక బోధన విధానాలు, అనుభవాత్మక విద్య అందించాలనే లక్ష్యంతో ‘స్కిల్‌ ఫియెస్టా’ వర్క్‌షాప్‌ నిర్వహించినట్లు ప్రిన్సిపల్‌ దియా బెనర్జీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వర్క్‌షాప్‌లో విద్యార్థులు వివిధ ప్రాక్టికల్‌, ఇంటరాక్టివ్‌ సెషన్ల ద్వారా తమ ప్రతిభను గుర్తించే అవకాశాన్ని పొందారు. సంప్రదాయ తరగతి బోధనకు భిన్నంగా, పిల్లలు కార్యాచరణల ద్వారా నేర్చుకుంటూ వివిధ అంశాలు, సామర్థ్యాలను వర్క్‌షాప్‌లో తెలిసుకున్నారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.కార్యక్రమంలో నిశితా ఇంటర్నేషనల్‌ స్కూల్‌ యాజమాన్యం చీఫ్‌ ప్యాట్రన్‌ చౌదవరమ్‌ వినయ్‌ కుమార్‌, చైర్మన్‌ మిస్టర్‌ చౌదవరమ్‌ నిఖిల్‌, డైరెక్టర్‌ చౌదవరమ్‌ పూజ, టీచర్లు సిబ్బంది పాల్గొన్నారు.

సిరికొండ: మండలంలోని రావుట్ల గ్రామానికి చెందిన మేతరి రాజారాం అనే వ్యక్తి అనారోగ్యంతో నాలుగు రోజుల క్రితం మృతి చెందారు. నిరుపేద కుటుంబం కావడంతో గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులు మృతుడి కుటుంబ సభ్యులకు రూ. 21 వేల నగదును అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రాజ్‌కుమార్‌, వీడీసీ చైర్మన్‌ భూమన్న, తోట రాజన్న, రాజేందర్‌, సతీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

సిరికొండ: మండలంలోని న్యావనంది గ్రామంలో మల్లన్న ఆలయం వద్ద నూతనంగా ఏర్పాటుచేసిన హైమాస్ట్‌ లైట్‌ను సర్పంచ్‌ మామిడికింది దీపనరేందర్‌తో కలిసి కాంగ్రెస్‌ యువ నాయకులు ఉమ్మాజీ నరేశ్‌ ఆదివారం ప్రారంబించారు. ఆలయం వద్ద ఎమ్మెల్యే భూపతిరెడ్డి లైట్‌ను ఏర్పాటు చేయించారని నరేశ్‌ తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్‌ రిక్క ముత్తెన్న, మాజీ ఎంపీటీసీ ముష్కీల్‌ నరేందర్‌, నేల్ల దాసు తదితరులు పాల్గొన్నారు.

ిసరికొండ:మండలంలోని గడ్కోల్‌ గ్రామంలో ఆదివాసీ నాయక్‌పోడు సేవా సంఘం కులస్తుల మండల ఆత్మీయ సమ్మేళనం సోమవారం నిర్వహిస్తున్నట్లు ముషీర్‌నగర్‌ ఉపసర్పంచ్‌ ధోని మోహన్‌, కర్నాల ప్రభు, కళ్లెం నర్సయ్య, దుంపల సాయిలు, రమేశ్‌లు తెలిపారు. సమ్మేళనానికి సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు గాండ్ల రాంచందర్‌ ముఖ్య అతిథిగా వస్తున్నట్లు తెలిపారు. మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నట్లు వారు తెలిపారు.

రోగులకు మెరుగైన  సేవలందించాలి 
1
1/3

రోగులకు మెరుగైన సేవలందించాలి

రోగులకు మెరుగైన  సేవలందించాలి 
2
2/3

రోగులకు మెరుగైన సేవలందించాలి

రోగులకు మెరుగైన  సేవలందించాలి 
3
3/3

రోగులకు మెరుగైన సేవలందించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement