బీజేపీకి ప్రజలే బాస్‌ | - | Sakshi
Sakshi News home page

బీజేపీకి ప్రజలే బాస్‌

Mar 7 2026 7:24 AM | Updated on Mar 7 2026 7:24 AM

మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌

మాధవనగర్‌లో బీజేపీ కౌన్సిలర్‌, కార్పొరేటర్ల ఆత్మీయ అభినందన సభ

నిజామాబాద్‌ రూరల్‌: బీజేపీ అంటేనే క్రమశిక్షణ పార్టీ అని, ఇందులో ఎవరు బాస్‌లు కాదు ప్రజలే బాస్‌లు అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకువస్తామన్నారు. ప్రజలు పదేళ్లు కేసీఆర్‌ పా లన చూసి బొంద పెట్టారన్నారు. రెండు సంవత్సరాలు పాలించిన రేవంత్‌ ప్ర భుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. మాధవనగర్‌లోని క మ్మ సంఘంలో శుక్రవారం నిజామాబాద్‌పార్లమెంట్‌ పరిధిలో నూతనంగా ఎన్నికై న బీజేపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్ల ఆత్మీయ అభినందన సభ నిర్వహించా రు. కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. దివంగత నేత ధర్మపురి శ్రీనివాస్‌ ప ద్ధతి ప్రకారం నడుచుకునే నాయకుడని, రాష్ట్ర సాధ న కోసం ధర్మరాజు పాత్ర పోషించారన్నారు. అంతుకుముందు ఎంపీ ధర్మపురి అర్వింద్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో హుందాగా ఉన్న ఏకై క నాయకుడు ఈటల రాజేందర్‌ అని, ఆయనతో కలిసి రా ష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తెస్తామన్నారు. ప్ర జాస్వామ్యంలో వ్యాపారం చేయడం సరికాదు, అందుకే నిజామాబాద్‌ మేయ ర్‌ పదవిని వదులుకున్నామన్నారు. అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజ లు బీజేపీకి నైతికంగా పట్టం కట్టారన్నారు. ప్రజల కు సేవలందిస్తే నేతలకు రాజకీయ పరంగా భవిష్య త్తు ఉంటుందన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్‌ కులాచారి మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన ప్రాధాన్యత ఇస్తామన్నారు. పసుపు బోర్డు చైర్మన్‌ పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలంతా బీజేపీ వైపు ఉన్నారన్నారు. బల్దియా ఎన్నికల్లో బీజేపీ తరఫున నిలబడినందుకు ఇందూ రు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అ నంతరం ఎంపీలు రాజేందర్‌, అర్వింద్‌, ఎమ్మెల్యే ధ న్‌పాల్‌ సూర్యనారాయణలను గజమాలతో సన్మా నించారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్లను సన్మానించా రు. రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లావణ్య, శ్రీకాంత్‌రెడ్డి, జగిత్యా ల జిల్లా అధ్యక్షుడు యాదగిరిబాబు, జిల్లా ప్రబారి కాంతారావు, కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement