బాధిత కుటుంబం ఆందోళన | - | Sakshi
Sakshi News home page

బాధిత కుటుంబం ఆందోళన

Mar 5 2026 7:18 AM | Updated on Mar 5 2026 7:18 AM

సుభాష్‌నగర్‌/ఇందల్వాయి: ఆత్మహత్య చేసుకున్న ఏకలవ్య ఆదర్శ గురుకులం విద్యార్థి రామచరణ్‌ కుటుంబ సభ్యులు బుధవారం పాఠశాల ఎదుట, జిల్లా కేంద్రంలోని ప్ర భుత్వ జనరల్‌ ఆస్పత్రి ఎదుట ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆర్‌సీవో గంగారాం నాయక్‌ పాఠశాలకు చేరుకొని విచారణ చేపట్టారు. పాఠశాల వద్ద పోలీసులు బందబోస్తు నిర్వహించారు. ఉపాధ్యాయుల ఒత్తిడి కారణంగానే రామ్‌చరణ్‌ ఆత్మహత్య చేసుకున్నాడని వారు ఆరోపించారు. విచారణ చేపట్టి దోషులను శిక్షించాలని, ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలో కొద్దిసేపు ట్రాఫిక్‌ స్తంభించింది. పోలీసులు అక్కడికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యులను సముదాయించి పంపించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఇందల్వాయి ఎస్సై సందీప్‌ తెలిపారు.

ఇందల్వాయిలో మాట్లాడుతున్న బాధితులు

జీజీహెచ్‌ ఎదుట బైఠాయించిన బాధిత కుటుంబం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement