నిజామాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని ముస్తాయిద్‌పుర కాలనీలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ శాఖ ఎస్‌హెచ్‌వో స్వప్న మంగళవారం తెలిపారు. వివరాలు ఇలా.. ముస్తాయిద్ పురకు చెందిన షేక్ అబ్దుల్ కై సర్ అనే వ్యక్తి తన ఇంటిలో గంజాయి కలిగి ఉండి విక్రయిస్తున్నాడని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే వారు నిందితుడి ఇంటిపై దాడి చేయగా, 1.6 కిలోల గంజాయి లభించిందన్నారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు.
వేల్పూర్ మండలంలో..
వేల్పూర్: వేల్పూర్ క్రాస్‌రోడ్డు 63 నంబరు జాతీయ రహదారిపై మంగళవారం గంజాయిని సరఫరా చేయడానికి వచ్చిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్సై సంజీవ్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు వేల్పూర్ క్రాస్‌రోడ్డు వద్ద నిఘా ఉంచగా భీమ్‌గల్‌కు చెందిన శ్రీరామ్ అఖిల్, సయ్యద్ సోహైల్, నాందేడ్‌కు చెందిన షేక్ అర్బాజ్, నాందేడ్‌కు చెందిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేశామన్నారు. వారి వద్ద 47 గ్రాముల చరస్(గంజాయి పదార్థం), 29 గ్రాముల ఎండు గంజాయి లభించినట్లు వెల్లడించారు. వీరంతా వేల్పూర్ మండలంలోని ఒక వ్యక్తికి గంజాయి సరఫరా చేస్తున్నట్లు తెలిసి, నిఘా ఉంచగా పట్టుబడ్డట్లు వెల్లడించారు. వీరి వద్ద నుంచి ఒక ద్విచక్రవాహనం, నాలుగు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
డిచ్‌పల్లి(ఇందల్వాయి): పోలీసుల విధులకు అడ్డంకి కలిగించిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఇందల్వాయి ఎస్సై సందీప్ తెలిపారు. వివరాలు ఇలా.. ఇందల్వాయి పోలీస్ స్టేషన్‌కు సంబంధించి సోమవారం రాత్రి విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు పోతుల ప్రతాప్, తిరుపతిలకు అర్ధరాత్రి మెగ్యానాయక్ తండాలో గొడవ జరుగుతున్నట్లు డయల్ 100 ద్వారా సమాచారం అందింది. వెంటనే వారు తండాకు చేరుకుని పరిశీలించగా లకావత్ నరేష్, లకావత్ బంతిలాల్, దెగావత్ పీర్‌సింగ్ అలియాస్ చందు మద్యం మత్తులో గొడవ పడుతూ అల్లర్లు సృష్టిస్తున్నట్లు గుర్తించారు. వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించగా పోలీసులను దూషిస్తూ విధినిర్వహణకు అడ్డంకి కలిగించారు. కానిస్టేబుళ్ల ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసి మంగళవారం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.
నిజామాబాద్‌అర్బన్: గ్రామస్తులను బెదిరింపులకు గురిచేస్తు న్న కానిస్టేబుల్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని నందిపే ట మండలం లక్కంపల్లి సర్పంచ్ సంతోష్‌గౌడు మంగళవా రం సీపీ సాయి చైతన్యకు ఫిర్యాదు చేశారు. హోలీ రోజున కామదహనాన్ని డప్పులతో ర్యా లీగా తీసుకురాలేదని గ్రామ కమిటీతో తనపై రూ.5000 జరిమానా వేయించారన్నారు. అ లాగే గ్రామంలో తరచు అనేక వివాదాలు సృష్టించడం గొడ వలకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాడని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన స్థాని క సంస్థల ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయా ల్లో పా ల్గొంటూ గొడవలకు కారణం అవుతున్నాడని పేర్కొన్నారు. వెంటనే ఉన్నతాధికారులు విచారణ జరిపిచర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
కొరియర్ సిబ్బందిపై..
నిజామాబాద్‌అర్బన్: కొరియర్ సిబ్బంది తన వస్తువులను మాయం చేశాడని వెంకటరమణ అనే వ్యక్తి మంగళవారం రెండవ టౌన్‌లో ఫిర్యాదు చేశాడు. బాధితుడు తెలిపిన వివరాలు ఇలా.. ఇటీవల ఓ ప్రయివేట్ కొరియర్ ద్వారా తాను పార్సిల్ పంపానని, అందులో నాలుగు ట్యాబ్‌లు ప్యాకింగ్ చేసి కొరియర్ యజమానికి అందజేశానన్నారు. అయితే పా ర్సిల్ చేరాల్సిన స్థలానికి వెళ్లలేదన్నారు. తాము విచారిస్తే స దరు కొరియర్ సిబ్బంది తన పార్సిళ్లను మాయం చేసినట్లు తెలిసిందన్నారు. హైదరాబాద్‌లోని సదరు కొరియర్ బ్రాంచ్ ను సంప్రదించగా సరైన సమాధానం ఇవ్వలేదన్నారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.


